Shivsena కార్యకర్తల జోలికొస్తే..: Uddhav Thackeray

ABN , First Publish Date - 2022-07-16T01:17:44+05:30 IST

శివసేన(Shivsena) కార్యకర్తలపై దాడులను ఎంతమాత్రం సహించేది లేదని ఆ పార్టీ అధినేత(Shiv Sena chief), మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి(former Maharashtra Chief Minister) ఉద్ధవ్ థాకరే(Uddhav Thackeray) అన్నారు. తాజాగా శివసేన కార్యకర్తలపై దాడులు జరిగాయని పార్టీ వర్గాల నుంచి వస్తున్న ఆరోపణల నేపథ్యంలో శుక్రవారం..

Shivsena కార్యకర్తల జోలికొస్తే..: Uddhav Thackeray

ముంబై: శివసేన(Shivsena) కార్యకర్తలపై దాడులను ఎంతమాత్రం సహించేది లేదని ఆ పార్టీ అధినేత(Shiv Sena chief), మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి(former Maharashtra Chief Minister) ఉద్ధవ్ థాకరే(Uddhav Thackeray) అన్నారు. తాజాగా శివసేన కార్యకర్తలపై దాడులు జరిగాయని పార్టీ వర్గాల నుంచి వస్తున్న ఆరోపణల నేపథ్యంలో శుక్రవారం ముంబైలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. గురువారం అర్థరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు బబన్ గోన్‌కర్‌ అనే కార్యకర్తపై దాడి చేశారు. కాగా, గోన్‌కర్‌ను ఉద్ధవ్ శుక్రవారం పరామర్శించారు. శివసేన రెండుగా చీలిన అనంతరం తమ వర్గంపై అధికార వర్గాల కార్యర్తలు దాడులు కొనసాగుతున్నాయని ఉద్ధవ్ శివసేన వర్గం ఆరోపిస్తోంది. ఇదే విషయమై ఉద్ధవ్ మాట్లాడుతూ ‘‘శివసేన కార్యకర్తలపై ఈగ వాలినా సహించేది లేదు. మా కార్యకర్తపై దాడికి పాల్పడ్డ వారిని పోలీసులు పట్టుకోకపోతే ఆ పని శివసేన కార్యకర్తలు చేస్తారు. పోలీసులు రాజకీయాల్లో తలదూర్చొద్దు’’ అని అన్నారు.

Updated Date - 2022-07-16T01:17:44+05:30 IST