‘ మహిళలపై దాడులను అరికట్టాలి’

ABN , First Publish Date - 2022-08-11T05:04:32+05:30 IST

కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మహిళలపై దాడులు పెరిగిపోయాయని, వాటిని అరికట్టాలని ఐద్వా జిల్లా కార్యదర్శి ఐఎన్‌ సుబ్బమ్మ పేర్కొన్నారు.

‘ మహిళలపై దాడులను అరికట్టాలి’

ప్రొద్దుటూరు టౌన్‌, ఆగస్టు 10 : కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మహిళలపై దాడులు పెరిగిపోయాయని, వాటిని అరికట్టాలని ఐద్వా జిల్లా కార్యదర్శి ఐఎన్‌ సుబ్బమ్మ పేర్కొన్నారు. బుధవారం ఎన్జీఓ హోంలో ఏపీ మహిళా సంఘం మహాసభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మహిళలపై హత్యలు, అత్యాచారాలు, లైంగిక వేధింపులు, దాడులు పెరిగిపోయాయని విమర్శించారు. మహిళలపై దాడులను అరికట్టడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయన్నారు. సీఐటీయూ జిల్లా కార్యదర్శి సత్యనారాయణ మాట్లాడుతూ మహిళా కార్మికులు పనిచేసే చోట వారికి భద్రత కొరవడిందని పేర్కొన్నారు. కార్మికుల హక్కులను పరిరక్షించడంలో కేంద్ర, రా ష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయన్నారు.కార్యక్రమంలో మహిళా సం ఘం నాయకులు సర్వేశ్వరి, రాములమ్మ, నాగలక్ష్మి, శారద, హేమలత, శకుంతల, సీఐటీయూ నాయకుడు విజయకుమార్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2022-08-11T05:04:32+05:30 IST