అట్టహాసంగా బ్రహ్మోత్సవాలు ప్రారంభం

ABN , First Publish Date - 2021-03-02T04:46:15+05:30 IST

తిక్కవీరేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి.

అట్టహాసంగా బ్రహ్మోత్సవాలు ప్రారంభం
కోలాటమాడుతున్న భక్తులు

అయిజ, మార్చి1: తిక్కవీరేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. అయిజ పట్టణంలోని ఎక్లాస్‌పూర్‌ రహదారిలో వాగు పక్కన కొలువుదీరిన తిక్కవీరేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు ప్రతి ఏటా వైభవంగా నిర్వహిస్తారు. ఇందులో భాగంగా సోమవారం స్వామి వారి ఊరేగింపుతో ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. నాయికి లక్ష్మిరెడ్డి ఇంటి నుంచి ఎద్దుల బండిపై ప్రారంభమైన ఊరేగింపు పోలీస్టేషన్‌, పాతబస్టాండు మీదుగా ఆలయం వరకు సాగింది. భాజాభజంత్రీలు, మేళతాళాలు, వేదమంత్రాలు, భక్తుల నీరాజనం మధ్యన కను ల పండువగాసాగింది. దారి పొడవునా భక్తులు నిండుకడువ నీరు పోసి పూజ లు నిర్వహించి తమ మొక్కులు తీర్చుకున్నారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ శాఖ అధ్యక్షుడు పటేల్‌ విష్ణువర్ధన్‌రెడ్డి, సింగిల్‌విండో అధ్యక్షుడు పోతుల మధుసూదన్‌రెడ్డి, పురపాలక చైర్మన్‌ దేవన్న, మల్లికార్జున్‌రెడ్డి, వాగుగడ్డ విష్ణువర్ధన్‌రెడ్డి, రవిరెడ్డి, సతీష్‌రెడ్డి, నిర్మల్‌కుమార్‌, కృష్ణ, అరుణ్‌ పాల్గొన్నారు.

Updated Date - 2021-03-02T04:46:15+05:30 IST