అట్టహాసంగా రొట్టెల పండుగ ప్రారంభం

ABN , First Publish Date - 2022-08-10T09:48:23+05:30 IST

మతసామరస్యానికి ప్రతీకగా, కోర్కెల పండుగగా పేరుగడించిన రొట్టెలపండుగ మంగళవారం నెల్లూరులో అట్టహాసంగా ప్రారంభమైంది.

అట్టహాసంగా రొట్టెల పండుగ ప్రారంభం

తొలిరోజే లక్ష దాటిన భక్తులు

నెల్లూరు (సాంస్కృతికం) ఆగస్టు 9: మతసామరస్యానికి ప్రతీకగా, కోర్కెల పండుగగా పేరుగడించిన రొట్టెలపండుగ మంగళవారం నెల్లూరులో అట్టహాసంగా ప్రారంభమైంది. తొలిరోజే లక్ష మందికి పైగా భక్తజనం తరలివచ్చినట్టు అధికారులు అంచనా వేస్తున్నారు. కరోనా మహమ్మారి కారణంగా రెండేళ్లు రొట్టెలపండుగ జరగలేదు. ఈ ఏడాది జరుగుతున్న ఈ వరాల పండుగకు భక్తులు భారీగా తరలివస్తారని జిల్లా అధికార యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేసింది. తెలుగు రాష్ట్రాలతోపాటు కర్నాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి భక్తులు తరలివస్తున్నారు. వచ్చిన భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా నగర పాలక సంస్థ, రెవెన్యూ, విద్యుత్‌, పోలీస్‌  శాఖల సిబ్బంది సమన్వయంతో సేవలు అందిస్తున్నారు. రొట్టెల పండుగలో తొలిరోజు అర్ధరాత్రి సందల్‌మాల్‌ను  (బారాషహీద్‌లను శుభ్రం చేసి గంధం పూయడం) భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఉదయం రాష్ట్ర మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి, కలెక్టర్‌ చక్రధర్‌రావు, ఎస్పీ విజయరావు, మేయర్‌ స్రవంతి, కమిషనర్‌ హరిత దర్గాను దర్శించుకుని ప్రార్థనలు చేశారు. స్వర్ణాల చెరువు ఘాట్‌ వద్ద, దర్గా వద్ద క్యూలైన్లను పరిశీలించి, సిబ్బందికి  సూచనలు చేశారు. తొలిరోజు స్వర్ణాల చెరువులో  చదువు, వివాహ, ఆరోగ్య రొట్టెలకు డిమాండ్‌ ఏర్పడింది. 

Updated Date - 2022-08-10T09:48:23+05:30 IST