NSUI Protest: మంత్రి సబితా రెడ్డి ఇంటి ముట్టడికి ఎన్‌ఎస్‌యూఐ నేతల యత్నం

ABN , First Publish Date - 2022-07-28T18:39:29+05:30 IST

విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఇంటిని ముట్టడించేందుకు ఎన్‌ఎస్‌యూఐ నేతలు యత్నించారు.

NSUI Protest:  మంత్రి సబితా రెడ్డి ఇంటి ముట్టడికి ఎన్‌ఎస్‌యూఐ నేతల యత్నం

హైదరాబాద్: విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి (Sabita indra reddy) ఇంటిని ముట్టడించేందుకు ఎన్‌ఎస్‌యూఐ (NSUI) నేతలు యత్నించారు. ఈనెల 15న బాసర ట్రిపుల్ ఐటీ (Basara IIIT)లో ఫుడ్ పాయిజన్ అయిన విషయం తెలిసిందే. సుమారు ఆరువందల మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. కాగా... ఫుడ్ పాయిజన్ వల్ల  పీయూసీ ద్వితీయ సంవత్సరం విద్యార్థి సంజయ్ కిరణ్ తీవ్ర అనారోగ్యానికి గురై చికిత్స పొందుతూ మృతి చెందాడు. అయితే ఫుడ్ పాయిజన్ వల్ల విద్యార్థి మరణించినా ప్రభుత్వం కానీ, సంబంధిత శాఖ మంత్రి పట్టించుకోవడంలేదని ఎన్‌ఎస్‌యూఐ ఆందోళన చేపట్టారు. ఇందులో భాగంగా ఈరోజు మంత్రి సబిత ఇంటిని ముట్టడించేందుకు నేతలు యత్నించగా... పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఆందోళనకారులకు, పోలీసులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ముట్టడికి వచ్చిన  విద్యార్థులు, నాయకులను అరెస్టు చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.

Updated Date - 2022-07-28T18:39:29+05:30 IST