Kodali Nani ఇంటి ముట్టడికి తెలుగు మహిళల యత్నం

ABN , First Publish Date - 2022-09-06T18:26:46+05:30 IST

మాజీ మంత్రి కొడాలి నాని (Kodali nani) క్షమాపణ చెప్పాలంటూ గుడివాడలో తెలుగు మహిళల డిమాండ్ చేస్తున్నారు.

Kodali Nani ఇంటి ముట్టడికి తెలుగు మహిళల యత్నం

అమరావతి: మాజీ మంత్రి కొడాలి నాని (Kodali nani) క్షమాపణ చెప్పాలంటూ గుడివాడలో తెలుగు మహిళల డిమాండ్ చేస్తున్నారు. కొడాలి నాని (YCP Leader) ఇంటిని ముట్టడించేందుకు తెలుగు మహిళలు యత్నించగా.. వారిని పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులతో మహిళలు వాగ్వాదానికి దిగారు. పలువురు టీడీపీ నాయకుల (TDP Leaders)ను పోలీసులు అరెస్ట్ చేశారు. మహిళలను కించపరిచిన కొడాలి నాని క్షమాపణ చెప్పాలంటూ రోడ్డుపై బైఠాయించి తెలుగు మహిళలు ధర్నా చేపట్టారు. కొడాలి నాని కు వ్యతిరేకంగా పెద్దపెట్టున నినాదాలు చేశారు. టీఎల్పీ అంటే తెలుగు లయన్స్ పార్టీ అంటూ తెలుగు మహిళలు నినాదాలు చేశారు. 

Updated Date - 2022-09-06T18:26:46+05:30 IST