మరో భారీ అప్పునకు జగన్ ప్రయత్నాలు?

Dec 7 2021 @ 17:33PM

అమరావతి: సివిల్ సప్లయ్స్ కార్పొరేషన్ ద్వారా మరో భారీ అప్పునకు జగన్ సర్కార్ ప్రయత్నాలు మమ్మరం చేసింది. ఏపీ స్టేట్‌ సివిల్‌ సప్లైస్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌కు 5 వేల కోట్ల రుణం కోసం బ్యాంక్ గ్యారెంటీ ఇస్తూ గెజిట్‌ను  ఏపీ ప్రభుత్వం విడుదల చేసింది. 5 వేల కోట్లను రైతుల నుంచి 2021, 22 ఏడాదికి కొనుగోలు చేసిన ధాన్యం చెల్లింపులకోసం తీసుకుంటున్నట్టు వెల్లడించింది. ఈ మేరకు బ్యాంకుల నుంచి రుణం తీసుకునేందుకు తగిన ఏర్పాట్లు చేయాలని సివిల్‌ సప్లైస్‌ కమిషనర్‌ను ఆదేశిస్తూ ప్రభుత్వం గెజిట్‌ను విడుదల చేసింది.    


Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.