ఆకట్టుకున్న వైజ్ఙానిక ప్రదర్శన

ABN , First Publish Date - 2021-03-02T05:35:31+05:30 IST

: సైన్స్‌ డేను పురస్కరించుకొని స్థానిక ఉన్నత పాఠశాలలో సోమవారం నిర్వహించిన వైజ్ఞానిక ప్రదర్శన ఆకట్టుకుంది. 45 మంది బాలబాలికలు తాము రూపొందించిన ప్రాజెక్టులను ప్రదర్శనకు ఉంచారు. వీటిని విద్యార్థులు ఆసక్తిగా తిలకరించారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయురాలు రమాదేవి మాట్లాడుతూ శాస్త్ర పరిశోధనలు సమాజాన్ని అభివృద్ధిపథంలోకి తీసుకెళ్తాయన్నారు.

ఆకట్టుకున్న వైజ్ఙానిక ప్రదర్శన
ప్రాజెక్ట్‌ గురించి ఉపాధ్యాయుడికి వివరిస్తున్న విద్యార్థిని

పంగులూరు, మార్చి 1 : సైన్స్‌ డేను పురస్కరించుకొని స్థానిక ఉన్నత పాఠశాలలో సోమవారం నిర్వహించిన వైజ్ఞానిక ప్రదర్శన ఆకట్టుకుంది. 45 మంది బాలబాలికలు తాము రూపొందించిన ప్రాజెక్టులను ప్రదర్శనకు ఉంచారు. వీటిని విద్యార్థులు ఆసక్తిగా తిలకరించారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయురాలు రమాదేవి మాట్లాడుతూ శాస్త్ర పరిశోధనలు సమాజాన్ని అభివృద్ధిపథంలోకి తీసుకెళ్తాయన్నారు. ఉత్తమ ప్రాజెక్టులను ఎంపిక చేసి ప్రోత్సాహక బహుమతులు అందజేశారు. సైన్స్‌డేను పురస్కరించుకుని నిర్వహించిన క్విజ్‌, టాలెంట్‌ టెస్ట్‌ల్లో విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.


Updated Date - 2021-03-02T05:35:31+05:30 IST