సర్పంచ్‌ల సమక్షంలో బెల్ట్‌షాపుల వేలం

ABN , First Publish Date - 2021-10-14T05:42:01+05:30 IST

సర్పంచ్‌ల సమక్షంలో బెల్ట్‌షాపుల వేలం

సర్పంచ్‌ల సమక్షంలో బెల్ట్‌షాపుల వేలం
మర్పల్లిలోని వైన్‌షాప్‌ నుంచి గ్రామంలో అమ్మేందుకు తీసుకువెళుతున్న మద్యం కాటన్లు

  • వికారాబాద్‌ జిల్లాలో కొత్త సంప్రదాయం
  • సిరిపురంలో రూ.4 లక్షలకు దక్కించుకున్న వ్యక్తి
  • రావులపల్లిలో 72 వేలకు.. మరికొన్ని గ్రామాల్లో వేలానికి సన్నాహాలు
  • తమ జీవితాలు నాశనం అవుతున్నాయని మహిళల ఆవేదన

(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, వికారాబాద్‌): భూములు, ప్రత్యేక వస్తువులు, అధికారిక మద్యం దుకాణాలు వంటి వాటిని వేలం వేయడం గురించి సాధారణంగా వింటుంటాం. అయితే, వికారాబాద్‌ జిల్లాలో బెల్ట్‌షాపులు వేలం వేశారు. సర్పంచ్‌ల ఆధ్వర్యంలోనే బెల్ట్‌ షాపుల వేలం కొనసాగడం గమనార్హం. బెల్ట్‌షాపులు చట్ట విరుద్ధమన్న విషయం తెలిసిందే. అయినప్పటికీ మర్పల్లి మండలం రావులపల్లి, సిరిపురం గ్రామాల్లో సర్పంచ్‌లు, పలువురు నాయకుల ఆధ్వర్యంలో గ్రామస్థుల సమక్షంలోనే బెల్ట్‌ షాపులకు వేలం నిర్వహించడం చర్చనీయాంశమైంది. రావులపల్లిలో బెల్ట్‌ షాప్‌ నిర్వహించుకునే అవకాశాన్ని వేలంలో ఓ వ్యక్తి రూ.72 వేలకు దక్కించుకున్నాడు. సిరిపురంలోనూ బెల్డ్‌షా్‌పనకు గ్రామ సభలో వేలం నిర్వహించగా రూ.4 లక్షలకు దాన్ని ఓ వ్యక్తి దక్కించుకున్నాడు. మర్పల్లి మండలంలో జరిగిన ఈ రెండు ఘటనలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. వేలంలో బెల్ట్‌షాపులను దక్కించుకున్న వారే ఆయా గ్రామాల్లో అక్రమంగా మద్యం అమ్ముతారు. వారికి గ్రామ పంచాయతీల అండదండలుంటాయి. మర్పల్లి మం డలంలోనే మరికొన్ని గ్రామాల్లోనూ బెల్ట్‌ షాపుల నిర్వహణకు వేలానికి సన్నాహాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. బెల్ట్‌షాపుల వల్ల తమ జీవితాలు నాశనం అవుతున్నాయని, ఆర్థికంగా నష్టపోతున్నామని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎవరికి ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదంటున్నారు. బెల్ట్‌షాపులను అరికట్టాల్సిన ఎక్సైజ్‌ అధికారులు సైతం ఎలాంటి చర్యలూ తీసుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి. కిరాణా దుకాణాల్లో మద్యం విక్రయాలు కొనసాగకుండా చర్యలు తీసుకోవాలని కూడా మహిళలు కోరుతున్నారు. అయితే, వారి ఆవేదనను ప్రజా ప్రతినిధులు, అధికారులు పట్టించుకోవటే ్లదు. గ్రామాల్లో అమ్మేందుకు మద్యం కాటన్లను మర్పల్లిలోని వైన్‌షాప్‌ నుంచి కొందరు తీసుకెళ్తున్నారు.

Updated Date - 2021-10-14T05:42:01+05:30 IST