మౌలానా అబుల్‌ కలాం ఆజాద్‌పై ఆడియో విడుదల

ABN , First Publish Date - 2021-03-06T05:16:18+05:30 IST

దేశ తొలి విద్యాశాఖ మంత్రి, భారతరత్న మౌలానా అబుల్‌ కలాం ఆజాద్‌ జీవితంపై రూపొందించిన ఆడియో సీడీని శుక్రవారం రాష్ట్ర జలవనరులశాఖ మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌ ఆవిష్కరించారు.

మౌలానా అబుల్‌ కలాం ఆజాద్‌పై ఆడియో విడుదల
సీడీని అవిష్కరిస్తున్న మంత్రి అనిల్‌

నెల్లూరు(వీఆర్సీ), మార్చి 5 : దేశ తొలి విద్యాశాఖ మంత్రి, భారతరత్న మౌలానా అబుల్‌ కలాం ఆజాద్‌ జీవితంపై రూపొందించిన ఆడియో సీడీని శుక్రవారం రాష్ట్ర జలవనరులశాఖ మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌ ఆవిష్కరించారు. కలెక్టర్‌ కేవీఎన్‌ చక్రధర్‌బాబు సహకారంతో గూడూరుకు చెందిన వేగూరు విజయకుమార్‌ ఈ గేయాన్ని రాసి స్వరపరిచారు. ఆజాద్‌ జీవిత చరిత్రను పాట ద్వారా ప్రజలకు తెలియజేయాలని సంకల్పించి సీడీని రూపొందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా మైనార్టీ సంక్షేమాధికారి సయ్యద్‌ అబ్దుల్‌ హమీద్‌, రూప్‌కుమార్‌ యాదవ్‌, షేక్‌ హాజీ, చైతన్య తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-03-06T05:16:18+05:30 IST