ఆంటీ పిల్లి!

ABN , First Publish Date - 2022-09-16T05:30:00+05:30 IST

ఒక ఊరిలో ఎలుకల పెళ్లి జరుగుతోంది. విపరీతమైన హడావిడి. ఎక్కడ చూసినా ఎలుకల గ్యాంగ్‌ సందడి చేస్తోంది. అడుగడుగునా బొరియలు, పూలు, ఆకులతో ఆ ప్రాంతం అంతా పెళ్లి వేడుకతో కళకళలాడుతోంది.

ఆంటీ పిల్లి!

ఒక ఊరిలో ఎలుకల పెళ్లి జరుగుతోంది. విపరీతమైన హడావిడి. ఎక్కడ చూసినా ఎలుకల గ్యాంగ్‌ సందడి చేస్తోంది. అడుగడుగునా బొరియలు, పూలు, ఆకులతో ఆ ప్రాంతం అంతా పెళ్లి వేడుకతో కళకళలాడుతోంది. పెళ్లి కూతురు ఎలుకను రెండు కప్పలు గంపలో పెట్టుకుని తీసుకుని వెళ్తున్నాయి. అంతలోనే ఓ పిల్లి బాగా ముస్తాబై ఎలుకల పెళ్లికి బయలుదేరింది.  పెళ్లి జరుగుతున్న ప్రాంతంలో అడుగెడుతూనే ‘ఆంటీ పిల్లి వచ్చింది. దాక్కోండి’ అంటూ ఓ ఎలుక అరిచింది. అంతే ఎక్కడికక్కడ గప్‌ చుప్‌. ఎలుకలన్నీ బొరియల్లోకి పరిగెత్తాయి. పెళ్ళికూతురు ఎలుక, పెళ్లికొడుకు ఎలుక ఎక్కడికీ పోలేక ఓ చెత్తకుప్ప దగ్గర దాక్కున్నారు. ఆంటీ పిల్లి అంతా కలియదిరుగుతోంది. పెళ్లి జరిగే ప్రాంతంలో ఒక్క ఎలుక కూడా కనిపించలేదు. ‘అరేయ్‌ ఎలుకల్లారా.. బొరియల్లోంచి బయటకు వచ్చేయండి’ అన్నది గట్టిగా. ‘ఆంటీ పిల్లి. నీ కథ మాకు తెలుసు. బయటికి రావటం కుదరదు’ అన్నది ఓ చిట్టెలుక. ‘ఆంటీ పిల్లి’ అనటంతో ఎలుకలన్నీ ఒకటే నవ్వులు. వెంటనే పిల్లి ఇలా అంది..


‘ఒరేయ్‌ అల్లుల్లూ, కోడల్లు బయటికి రండి’ అన్నది. ‘నా మీద ఒట్టు’ అన్నది. ఓ ఎలుక నమ్మింది. బొరియనుంచి బయటికొచ్చింది. పది నిమిషాల్లో ఎలుకలన్నీ బయటికొచ్చి.. పెళ్లి వేడుకల్లో బిజీ అయ్యాయి. పెళ్లి ఊరేగింపులోనూ పాల్గొంది పిల్లి. అంతేనా డ్యాన్సులేసింది. ఎవరూ చూడలేదని ఓ ఎలుకను మింగింది. ఇది ఓ చిట్టెలుక చూసింది. పిల్లికి బుద్ధి చెప్పాలనుకుంది. అంతలోనే ఇంకో ఎలుకను చంపి తినేసింది. అంతలోనే రెండు పందికొక్కులు వచ్చి పిల్లిమీదకు వల విసిరాయి. పిల్లి వలలో చిక్కుకుంది. ఆంటీ పిల్లిని గట్టిగా తన్నాయి. ‘క్షమించండి’ అంటూ వేడుకుంది. ఈసారి కనపడితే చంపేస్తానని ఎలుకలకు మిత్రుడైన ఓ కుక్క చెప్పింది. ఓ గంటపాటు ఆంటీ పిల్లిని బంధించి.. విడిచిపెట్టారు. ఆ రోజునుంచి ఆంటీ పిల్లి అటువైపే చూడలేదు. 

Updated Date - 2022-09-16T05:30:00+05:30 IST