ఆయుర్వేదంతో దీర్ఘకాల ఆరోగ్య జీవనం

ABN , First Publish Date - 2022-07-02T06:40:40+05:30 IST

ఆయుర్వేదంతో దీర్ఘకాల ఆరోగ్య జీవనం

ఆయుర్వేదంతో దీర్ఘకాల ఆరోగ్య జీవనం

ఉంగుటూరు, జూలై 1 : మనస్సును, శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకొని దీర్ఘకాలం జీవించడానికి అవసరమైన వ్యాధినిరోధకశక్తిని పెంచడంలో ఆయుర్వేద వైద్యవిధానం ఎంతగానో దోహదపడుతుందని ప్రభుత్వ ఆయుష్‌ విభాగం జోనల్‌-2 రీజినల్‌ డిప్యూటీ డైరెక్టర్‌ డాక్టర్‌ వెంకటకృష్ణ అన్నారు. డాక్టర్స్‌ డే సందర్భంగా తేలప్రోలు ఉషారామా ఇంజనీరింగ్‌ కళాశాలలో ప్రభుత్వ ఆయుర్వేద వైద్యశాల (కానుమోలు)ఆధ్వర్యంలో శుక్రవారం ఆయుర్వేదం, నాచురోపతిపై అవగాహనా సదస్సును నిర్వ హించారు. కానుమోలు, కానూరు, కొయ్యగూరపాడు   మెడికల్‌ ఆఫీసర్లు డాక్టర్‌ వాహిని, డాక్టర్‌ రాగలత, డాక్టర్‌ డి.మౌళీనాయక్‌, పెదఅవుటపల్లి, ముస్తాబాద ప్రభుత్వ నాచురోపతి  మెడికల్‌ ఆఫీసర్లు డాక్టర్‌ పోతన్‌శాస్త్రి, డాక్టర్‌ శ్రీధర్‌, ఉషారామా కళాశాల ప్రిన్సిపాల్‌ జీవీకేఎస్‌వీ ప్రసాద్‌, ఎన్‌ఎస్‌ ఎస్‌ ప్రోగ్రాం ఆఫీసర్‌ శ్రీహరిబాబు పాల్గొన్నారు.

పెనమలూరు : డాక్టర్‌ డే సందర్భంగా పోరంకి క్యాపిటల్‌ ఆసుపత్రి లో పనిచేస్తున్న డాక్టర్లను ఘనంగా సత్కరించారు. లయన్స్‌ క్లబ్‌ ఆఫ్‌ విజయవాడ వీఆర్‌కే వాణిజ్య క్లబ్‌ ఆధ్వర్యం లో అనుమోలు చారిటుల్‌ ట్రస్టు చైర్మన్‌ అనుమోలు ప్రభాకర రావు సౌజన్యంతో సత్కారాన్ని అందజేశారు. వైద్యులు భూపాల్‌, సు రేష్‌, ఉమాకాంత్‌, త్రినాథ్‌, స్టాలిన్‌ను సత్కరించారు. 

ఉయ్యూరు  : ప్రాణాలు కాపాడే వైద్యులు దైవంతో సమాన మని పవిత్రమైన వైద్యవృత్తిలో ఉన్నవారిని గౌరవించడం సంతోషక రమని వాకర్స్‌ అసోసియేషన్‌ జిల్లా 202 పాస్ట్‌ డిస్ట్రిక్‌ గవర్నర్‌ నూకల సాంబశివరావు అన్నారు. జాతీయ వైద్యుల దినోత్సోవం పురస్కరించుకుని రోటరీక్లబ్‌, వాకర్స్‌ అసోసి యేషన్‌ ఆధ్వర్యంలో శుక్రవారం కోలవెన్ను, కానూరు, నిడుమోలు, ఉయ్యూరు ఆయుర్వేద వైద్యశాల వైద్యాధికారులు పి.నీలిమ, రాగలత, లీలారాణి,  కోసూరి మీనాదేవిని ఘనంగా సత్కరిం చారు. వాకర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు డాక్టర్‌ తిరుమలరావు, సభ్యులు జి.శ్రీనివాసరావు, రామసత్యకిషోర్‌, కుటుంబరాజు,  ఆంజనేయులు, తులసీరామ్‌, కుటుంబరాజు, పొగిరి రాము, వెంకటేశ్వరరావు,  అనీస్‌  పాల్గొన్నారు. 

Updated Date - 2022-07-02T06:40:40+05:30 IST