Australia Captain ఆరోన్ ఫించ్ సంచలన నిర్ణయం..

ABN , First Publish Date - 2022-09-10T17:31:35+05:30 IST

ఆస్ట్రేలియా(Australia) వన్డే జట్టు కెప్టెన్(ODI team Captain) ఆరోన్ ఫించ్(Aaron Finch) సంచలన నిర్ణయం తీసుకున్నాడు. వన్డే క్రికెట్‎

Australia Captain ఆరోన్ ఫించ్ సంచలన నిర్ణయం..

ఆస్ట్రేలియా(Australia) వన్డే జట్టు కెప్టెన్(ODI team Captain) ఆరోన్ ఫించ్(Aaron Finch) సంచలన నిర్ణయం తీసుకున్నాడు. వన్డే క్రికెట్‎కు వీడ్కోలు(Farewell) పలుకుతన్నట్లు శనివారం ప్రకటించాడు. ఇంటర్నేషనల్(International) వన్డే క్రికెట్‌ నుంచి రిటైర్ అవుతున్నట్లు వెల్లడించాడు. ఈ సీజన్‎లో ఫించ్ పేలవమైన ప్రదర్శనను కనబర్చడంతోనే రిటైర్మంట్ ప్రకటించనట్లు తెలుస్తోంది. వన్డేలో తను ఆడిన 7 ఇన్నింగ్స్ ల్లో 26 పరుగులు మాత్రమే చేశాడు. కానీ,..వచ్చే ఏడాది భారత్‎లో(India) జరగనున్న వరల్డ్‎కప్‎లో(World Cup) టీమ్‎కు సారథ్యం చేయడమే తన టార్గెట్‎గా చెప్పినప్పటికీ శనివారం రిటైర్మంట్ ప్రకటించడం అభిమానులు ఆశ్చర్యానికి గురి చేసింది.


కాగా, రేపు న్యూజిలాండ్‌తో(New Zealand) తన చివరి మ్యాచ్‌ ఆడిన అనంతరం ఆరోన్ ఫించ్‌ వన్డే ఫార్మాట్ కు రిటైర్మెంట్ ఇవ్వనున్నాడు. కాగా, టీ20 జట్టుకు మాత్రం కెప్టెన్‎గా ఫించ్ కొనసాగనున్నాడు. ఫించ్ సారథ్యంలోనే గతేడాది జరిగిన టీ20 వరల్డ్ కప్‎ను(T20 World Cup) తొలిసారి గెలుచుకుంది. కెరీర్‎లో ఆరోన్ మొత్తం 54 వన్డే మ్యాచ్ లకు కెప్టెన్‎గా ఉన్నాడు. 50 ఓవర్ల వన్డే మ్యాచ్‎లో మొత్తంగా 17 సెంచరీల చేశాడు. ఫించ్ కంటే ముందు రికీ పాంటింగ్ (29 సెంచరీలు), వార్నర్, మార్క్ వా 18 సెంచరీలు చేశారు. 


ఆరోన్ ఫించ్..తన మాటల్లో..‘ఇది కొన్ని అద్భుతమైన జ్ఞాపకాలతో అద్భుతమైన ప్రయాణం. ఈ అద్భుతమైన వన్డే జట్టులో భాగమైనందుకు చాలా సంతోషంగా ఉంది. నేను ఆడిన వారితో కలిసి ఉండటం నా అదృష్టంగా భావిస్తున్నాను. నా ఈ ప్రయాణంలో నాకు సహకరించిన వారందరికీ ధన్యవాదాలు’ అంటూ ఫించ్ చెప్పుకొచ్చాడు. ఫించ్ నిర్ణయంతో ఆస్ట్రేలియా జట్టుకు మరో కొత్త సారథి రానున్నాడు. కొత్త కెప్టెన్ ఎవరు అనేది ఉత్కంఠ రేపుతోంది. అయితే ప్రస్తుతం ఉన్న జట్టులో వార్నర్, లేదా స్టీవ్ స్మిత్‎కు పగ్గాలు ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Updated Date - 2022-09-10T17:31:35+05:30 IST