ఆస్ట్రేలియాలో చంద్రబాబు పుట్టినరోజు వేడుకలు
ABN , First Publish Date - 2021-04-21T00:39:10+05:30 IST
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పుట్టినరోజు వేడుకలను ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానులు ఘనంగా నిర్వహించారు.
ఆస్ట్రేలియా: ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పుట్టినరోజు వేడుకలను ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానులు ఘనంగా నిర్వహించారు. టీడీపీ ఆస్ట్రేలియా విభాగం మెల్బోర్న్లో కేక్ కట్ చేసి తమ ఆనందాన్ని పంచుకుంది. ఈ రోజు విదేశాల్లో తెలుగువాళ్లు స్థిర పడటానికి చంద్రబాబు ముందు చూపు ఎంతో ఉపయోగపడిందని టీడీపీ శ్రేణులు వ్యాఖ్యానించాయి. ప్రపంచంలో ఉన్న ఎన్నారైలు ఎంతోమందికి స్ఫూర్తినిచ్చారని కొనియాడాయి.