Australia: విదేశీ విద్యార్థులకు ఆస్ట్రేలియా మరో గుడ్ న్యూస్..

ABN , First Publish Date - 2022-09-13T05:14:51+05:30 IST

నిపుణుల కొరతతో సతమతమవుతున్న ఆస్ట్రేలియా విదేశీయులను ఆకర్షించే దిశగా మరో నిర్ణయం తీసుకునేంది.

Australia: విదేశీ విద్యార్థులకు ఆస్ట్రేలియా మరో గుడ్ న్యూస్..

ఎన్నారై డెస్క్: నిపుణుల కొరతతో సతమతమవుతున్న ఆస్ట్రేలియా విదేశీయులను ఆకర్షించే దిశగా మరో నిర్ణయం తీసుకునేంది. విదేశీ విద్యార్థులు తమ చదువు పూర్తైన అనంతరం మరో రెండేళ్లు అదనంగా ఆస్ట్రేలియాలో ఉద్యోగాలు చేసుకునేలా గడువును పొడిగించింది. ప్రస్తుత నిబంధనల ప్రకారం.. ఆస్ట్రేలియాలో బ్యాచిలర్స్ డిగ్రీ పూర్తి చేసుకున్న వారు ఆ తరువాత రెండేళ్ల పాటు స్థానికంగా ఉపాధి పొందొచ్చు. మాస్టర్స్ డిగ్రీ పూర్తయ్యాక మూడేళ్లు, డాక్టోరల్ డిగ్రీ(పీహెచ్‌డీ) పొందిన తరువాత నాలుగేళ్లు ఆస్ట్రేలియాలోనే ఉంటూ ఉద్యోగం చేసుకోవచ్చు. తాజాగా మార్పులతో వీరందరూ మరో రెండేళ్ల పాటు అదనంగా ఆస్ట్రేలియాలోనే ఉపాధి పొందే అవకాశం వచ్చింది. అయితే.. ఏయే కోర్సుల వారికి ఈ పొడిగింపు వర్తిస్తుందనేది మాత్రం ప్రభుత్వం ఇంకా వెల్లడించలేదు. అయితే..నర్సింగ్, ఇంజినీరింగ్, ఐటీ వంటి ప్రాధాన్య రంగాల వారికి తొలి ప్రాధాన్యం ఉంటుందని సమాచారం.  ‘‘కొన్ని రంగాల్లోని పట్టభద్రులు దేశానికి అవసరమని ప్రభుత్వం భావిస్తోంది. తాజా నిబంధన కారణంగా ఇలాంటి వారు చదువైపోగానే నేరుగా నిపుణుల కొరత ఉన్న రంగాల్లో ఉపాధి పొందొచ్చు’’ అని ఆస్ట్రేలియా హోం ఎఫైర్స్ మంత్రి తాజాగా పేర్కొన్నారు. 

Updated Date - 2022-09-13T05:14:51+05:30 IST