ఆసీస్‌కు ఓదార్పు విజయం

Published: Sat, 25 Jun 2022 04:55:58 ISTfb-iconwhatsapp-icontwitter-icon
ఆసీస్‌కు ఓదార్పు విజయం

 3-2తో లంకదే సిరీస్‌

కొలంబో: శ్రీలంకతో జరిగిన చివరి వన్డేలో ఆస్ట్రేలియా నాలుగు వికెట్ల తేడాతో గెలిచింది. అయితే ఐదు వన్డేల సిరీస్‌ను మాత్రం లంక 3-2తో గెలుచుకుంది. శుక్రవారం జరి గిన ఈ మ్యాచ్‌లో ఆసీస్‌ బౌలర్లు అద్భుతంగా రాణించడంతో ఆతిథ్య జట్టు 43.1 ఓవర్లలో 160 పరుగులకే కుప్పకూలింది. ఎనిమిదో నెంబర్‌ బ్యాటర్‌ కరుణరత్నె (75) మినహా మరెవరూ రాణించలేదు. హాజెల్‌వుడ్‌, కునెమన్‌, కమిన్స్‌లకు రెండేసి వికెట్లు దక్కాయి. ఆ తర్వాత స్వల్ప లక్ష్యాన్ని ఆసీస్‌ 39.3 ఓవర్లలో 6 వికెట్లకు 164 పరుగులతో సునాయాసంగా ఛేదించింది. అలెక్స్‌ క్యారీ (45 నాటౌట్‌), లబుషేన్‌ (31), గ్రీన్‌ (25 నాటౌట్‌) రాణించారు. వెల్లలగెకు మూడు, తీక్షణకు రెండు వికెట్లు లభించాయి.

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.