Commonwealth Games: పీకల్లోతు కష్టాల్లో ఆస్ట్రేలియా

ABN , First Publish Date - 2022-07-29T23:35:55+05:30 IST

కామన్వెల్త్ గేమ్స్‌లో భాగంగా భారత మహిళలో జరుగుతున్న తొలి టీ20లో ఆస్ట్రేలియా (australia) ఎదురీదుతోంది. భారత

Commonwealth Games: పీకల్లోతు కష్టాల్లో ఆస్ట్రేలియా

బర్మింగ్‌హామ్: కామన్వెల్త్ గేమ్స్‌లో భాగంగా భారత మహిళలతో జరుగుతున్న తొలి టీ20లో ఆస్ట్రేలియా (australia) ఎదురీదుతోంది. భారత బౌలర్ రేణుకా సింగ్ (Renuka Singh) దెబ్బకు గింగిరాలు తిరుగుతోంది. భారత్ నిర్దేశించిన 155 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్‌ ప్రారంభించిన ఆస్ట్రేలియా 49 పరుగులకే ఐదు కీలక వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది.


తొలి ఓవర్ రెండో బంతికే ఓపెనర్ అలిస్సా హీలీ(0)ని దెబ్బతీసిన రేణుక సింగ్ ఆ తర్వాత కూడా నిప్పులు చెరిగే బంతులతో ఆసీస్ బ్యాటర్లను వణికించింది. ఆ జట్టు కోల్పోయిన ఐదు వికెట్లలో నాలుగు రేణుకకే దక్కాయంటే ఆమె బౌలింగ్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. బెత్‌మూనీ (10), కెమెన్ మెగ్ లానింగ్ (8), తహిలా మెక్‌గ్రాత్(14) వంటి కీలక ఆటగాళ్లను పెవిలియన్ పంపిన రుణుక భారత్‌ను విజయానికి దగ్గర చేసింది. రేచల్ హేన్స్(9)ను దీప్తి శర్మ అవుట్ చేసింది. ప్రస్తుతం 12 ఓవర్లు ముగిసే సరికి ఆస్ట్రేలియా 5 వికెట్ల నష్టానికి 91 పరుగులు చేసింది. ఆస్ట్రేలియా విజయం సాధించాలంటే 48 బంతుల్లో 64 పరుగులు అవసరం కాగా, భారత్ విజయానికి ఐదు వికెట్లు అవసరం.

Updated Date - 2022-07-29T23:35:55+05:30 IST