పెంపుడు కుక్కకు విమానంలో `నో ఎంట్రీ`.. దీంతో అనూహ్య నిర్ణయం తీసుకున్న మహిళ.. అవాక్కవుతున్న నెటిజన్లు!

ABN , First Publish Date - 2021-12-11T19:20:54+05:30 IST

ఆస్ట్రేలియాకు చెందిన ఆ దంపతులు గతేడాది ఇండోనేసియాలోని ఓ వీధి కుక్కను చూసి ముచ్చపడ్డారు..

పెంపుడు కుక్కకు విమానంలో `నో ఎంట్రీ`.. దీంతో అనూహ్య నిర్ణయం తీసుకున్న మహిళ.. అవాక్కవుతున్న నెటిజన్లు!

ఆస్ట్రేలియాకు చెందిన ఆ దంపతులు గతేడాది ఇండోనేసియాలోని ఓ వీధి కుక్కను చూసి ముచ్చపడ్డారు.. తమ దేశానికి తీసుకెళ్లి పెంచుకోవాలనుకున్నారు.. అయితే కరోనా ఆంక్షల నేపథ్యంలో ఆస్ట్రేలియా వెళ్లడానికి అనుమతి లేకపోవడంతో న్యూజిలాండ్ వరకు ఆ కుక్కను తీసుకెళ్లగలిగారు.. ఆస్ట్రేలియా విమానయాన అధికారుల నుంచి పర్మిషన్ వస్తుందని రోజుల తరబడి న్యూజిలాండ్‌లో నిరీక్షించారు.. ఎంతకీ అనుమతి లభించకపోడంతో అనూహ్య నిర్ణయం తీసుకున్నారు.. ఆ కుక్క కోసం ఏకంగా ప్రైవేట్ జెట్ బుక్ చేశారు.. ప్రస్తుతం ఈ స్టోరీ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 


ఆస్ట్రేలియాకు చెందిన టాష్ కార్బిన్, డేవిడ్ డైనెస్లే దంపతులు ఇండోనేసియాకు చెందిన ఓ కుక్కను పెంచుకోవాలనుకున్నారు. దానికి మంచ్కిన్ అని పేరు పెట్టారు. ఇతర దేశాల నుంచి అస్ట్రేలియాకు విమానయాన ఆంక్షలు ఉండడంతో దానిని న్యూజిలాండ్ వరకు తీసుకెళ్లారు. అక్కడే ఇద్దరు దంపతులు కొన్ని రోజులు తమ పెట్ డాగ్‌తో కలిసి ఉన్నారు. తమ పెట్ డాగ్‌ను అస్ట్రేలియాలోకి అనుమతించాల్సిందిగా రిక్వెస్ట్ పెట్టుకున్నారు. ఎంతకీ అనుమతి రాకపోవడంతో భర్తను, మంచ్కిన్‌ను అక్కడే వదిలేసి కార్బిన్ ఆస్ట్రేలియా వెళ్లిపోయింది. 


ఎప్పటికైనా అనుమతి వస్తుందనుకునే లోపు ఓమైక్రాన్ వేరియంట్ నేపథ్యంలో మూడో వేవ్ ఆంక్షలు అమల్లోకి వచ్చాయి. దీంతో కార్బిన్ ఓ అనూహ్య నిర్ణయం తీసుకుంది. పెట్ డాగ్ కోసం ఏకంగా రూ.24 లక్షలు ఖర్చుపెట్టి ప్రైవేట్ జెట్‌ను బుక్ చేసింది. త్వరలో క్రిస్మస్ రానున్న నేపథ్యంలో తన భర్త, పెంపుడు కుక్కతో పండుగ జరుపుకునేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు కార్బిన్ తెలిపింది. డబ్బు కంటే భర్త, పెంపుడు కుక్కతో పండుగ జరుపుకోవడమే తనకు ముఖ్యమని కార్బిన్ చెప్పుకొచ్చింది. పెంపుడు కుక్క కోసం కార్బిన్ చేసిన ఖర్చు గురించి విని కొందరు అవాక్కవుతున్నారు. 


Updated Date - 2021-12-11T19:20:54+05:30 IST