Australian లెజెండరీ వికెట్ కీపర్ రాడ్ మార్ష్ గుండెపోటుతో మృతి

ABN , First Publish Date - 2022-03-04T13:55:46+05:30 IST

ఆస్ట్రేలియా దిగ్గజ వికెట్ కీపర్ రాడ్ మార్ష్ శుక్రవారం ఉదయం గుండెపోటుతో మరణించారు...

Australian లెజెండరీ వికెట్ కీపర్ రాడ్ మార్ష్ గుండెపోటుతో మృతి

 మెల్‌బోర్న్:  ఆస్ట్రేలియా దిగ్గజ వికెట్ కీపర్ రాడ్ మార్ష్ శుక్రవారం ఉదయం గుండెపోటుతో మరణించారు.1970 నుంచి 1984వ సంవత్సరం వరకు ఆస్ట్రేలియా తరపున 96 టెస్ట్ మ్యాచ్‌లు ఆడిన రాడ్ మార్ష్ అడిలైడ్ ఆసుపత్రిలో మరణించినట్లు స్పోర్ట్ ఆస్ట్రేలియా హాల్ ఆఫ్ ఫేమ్ శుక్రవారం తెలిపింది.దిగ్గజ వికెట్ కీపర్ రాడ్ మార్ష్ 74 ఏళ్ల వయసులో మరణించడంతో క్రికెట్ ప్రపంచం శోకసంద్రంలో మునిగిపోయింది.రాడ్ మార్ష్ ఆస్ట్రేలియన్ క్రికెట్ పేస్ బౌలర్ డెన్నిస్ లిల్లీతో కలిసి అద్భుతమైన వికెట్ టేకింగ్ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.క్వీన్స్‌లాండ్ రాష్ట్రంలో నిధుల సేకరణ కార్యక్రమంలో మార్ష్ గుండెపోటుతో మరణించారు.మార్ష్ వికెట్ కీపర్ గా 355 ఔట్‌ల టెస్ట్ రికార్డును పొందాడు.


ఇతను లిల్లీ బౌలింగ్‌లో 95 పరుగులు కూడా చేశారు. ఫిబ్రవరి 1984లో టాప్-ఫ్లైట్ క్రికెట్ నుంచి రిటైర్ అయ్యే ముందు ఆస్ట్రేలియా తరపున 92 ఓడీఐలు కూడా ఆడాడు.ఎడమచేతి వాటం బ్యాటర్. ఇతను టెస్ట్ క్రికెట్‌లో సెంచరీ చేసిన మొదటి ఆస్ట్రేలియన్ వికెట్ కీపర్. రిటైర్‌మెంటు తర్వాత ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్‌లోని జాతీయ క్రికెట్ అకాడమీలకు నాయకత్వం వహించారు. దుబాయ్‌లోని అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్  ప్రపంచ కోచింగ్ అకాడమీకి ప్రారంభ అధిపతిగా పనిచేశారు.ఆస్ట్రేలియన్ లెజెండరీ లెగ్ స్పిన్నర్ షేన్ వార్న్ సోషల్ మీడియాలో మార్ష్‌కు నివాళులర్పించారు.2014లో మార్ష్ ఆస్ట్రేలియా సెలెక్టర్ల ఛైర్మన్‌గా నియమితుడయ్యారు. 


Updated Date - 2022-03-04T13:55:46+05:30 IST