ఒసాకకు చుక్కెదురు

Published: Sat, 22 Jan 2022 03:41:05 ISTfb-iconwhatsapp-icontwitter-icon
ఒసాకకు చుక్కెదురు

ప్రీ క్వార్టర్స్‌కు నడాల్‌, బార్టీ, అజరెంకా

మెల్‌బోర్న్‌: ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో సంచలనాల మీద సంచలనాలు నమోదవుతున్నాయి. తాజాగా డిఫెండింగ్‌ చాంప్‌ నవోమి ఒసాక మూడో రౌండ్‌లోనే ఓడి ఇంటిముఖం పట్టింది. శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్‌ మూడో రౌండ్‌లో జపాన్‌ స్టార్‌ ఒసాక 6-4, 3-6, 6-7(5) అనిసిమొవా (అమెరికా) చేతిలో కంగుతింది. ఆస్ట్రేలియా క్రీడాకారిణి బార్టీ 6-2, 6-3తో కమీలా జియోర్జి (ఇటలీ)పై, సక్కారి 6-4, 6-1తో కుదెర్‌మెటోవా (రష్యా)పై, క్రెజికొవా (చెక్‌) 2-6, 6-4, 6-4తో ఓస్టపెంకోపై గెలిచి నాలుగో రౌండ్‌కు చేరుకున్నారు.

ఒసాకకు చుక్కెదురు

రఫా జోరు..:

స్పెయిన్‌ బుల్‌ రఫెల్‌ నడాల్‌ 6-3, 6-2, 3-6, 6-1తో కారెన్‌ కచనోవ్‌ (రష్యా)ను ఓడించి నాలుగో రౌండ్‌కు చేరుకున్నాడు. జ్వెరెవ్‌ 6-3, 6-4, 6-4తో అల్బాబ్‌ (మాల్డోవా)పై, మాటో బెర్రెట్టిని (ఇటలీ) 6-2, 7-6(3), 4-6, 2-6, 7-6(5)తో కార్లోస్‌ గరఫీపై, మోన్‌ఫిల్స్‌ 7-6(4), 6-1, 6-3తో క్రిస్టీనా గారెన్‌పై గెలిచారు. 


అదరగొట్టిన అజరెంకా:

ఐదేళ్ల విరామం తర్వాత బెలారస్‌ ప్లేయర్‌ విక్టోరియా అజరెంకా ప్రీ క్వార్టర్స్‌లోకి అడుగుపెట్టింది. అజరెంకా 6-0, 6-2తో 15వ సీడ్‌ స్విటోలినా (ఉక్రెయిన్‌)ను ఓడించింది.  మ్యాచ్‌ అనంతరం కొడుకు లియోతో కలసి అజరెంకా విలేకరుల సమావేశం పాల్గొంది. 

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.