Australiaలో సీన్ రిపీట్.. వ్యాపారుల సహకారం కోరిన ప్రభుత్వం!

ABN , First Publish Date - 2022-07-21T01:42:30+05:30 IST

ఆస్ట్రేలియాలో కరోనా వైరస్.. తిరిగి విజృంభిస్తోంది. కేసుల నమోదుతోపాటు ఆసుపత్రిలో చేరుతున్న బాధితుల సంఖ్య కూడా క్రమంగా పెరుగుతుండటంతో ఆ దేశ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మహమ్మారిని అరికట్టడంలో వ్యాపారుల సహకారం కోరడంతో

Australiaలో సీన్ రిపీట్.. వ్యాపారుల సహకారం కోరిన  ప్రభుత్వం!

ఎన్నారై డెస్క్: ఆస్ట్రేలియాలో కరోనా వైరస్.. తిరిగి విజృంభిస్తోంది. కేసుల నమోదుతోపాటు ఆసుపత్రిలో చేరుతున్న బాధితుల సంఖ్య కూడా క్రమంగా పెరుగుతుండటంతో ఆ దేశ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మహమ్మారిని అరికట్టడంలో వ్యాపారుల సహకారం కోరడంతోపాటు.. ప్రజలకు సూచనలు చేసింది. 


బీఏ4, బీఏ 5 వేరియంట్ల కారణంగా ఆస్ట్రేలియాలో పెద్ద మొత్తంలో కేసులు నమోదువుతున్నాయి. బుధవారం ఒక్క రోజే రికార్డు స్థాయిలో కొవిడ్ బాధితులు ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారు. దీంతో ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం సౌకర్యం కల్పించాలని ప్రైవేట్ కంపెనీ యజమానులను కోరింది. అంతేకాకుండా ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. బూస్టర్ డోసులు తీసుకోవడంతోపాటు.. ఇండోర్‌లలో మాస్కులు ధరించాలని తెలిపింది. 


Updated Date - 2022-07-21T01:42:30+05:30 IST