How to Murder Your Husband.. అంటూ నవలను రాసిందో భార్య.. సరిగ్గా ఏడేళ్ల తర్వాత..

ABN , First Publish Date - 2022-05-27T20:51:10+05:30 IST

`హౌ టు మర్డర్ యువర్ హజ్బెండ్` పేరుతో నవల రాసిన ప్రముఖ రచయిత్రి నాన్సీ క్రాంప్టన్ తన భర్తను హత్య చేసినట్టు

How to Murder Your Husband.. అంటూ నవలను రాసిందో భార్య.. సరిగ్గా ఏడేళ్ల తర్వాత..

`హౌ టు మర్డర్ యువర్ హజ్బెండ్` పేరుతో నవల రాసిన ప్రముఖ రచయిత్రి నాన్సీ క్రాంప్టన్ తన భర్తను హత్య చేసినట్టు తేలడంతో కోర్టు ఆమెకు జీవిత ఖైదు విధించింది. ఆమెరికాలో నివసిస్తున్న నాన్సీ భర్త డానియెల్ బ్రాఫీ 2018 జూన్‌లో తన ఆఫీస్ గదిలో మరణించారు. డానియెల్ ఛాతిలో రెండు బుల్లెట్లు దిగాయి. ఆ ఘటనను అన్ని కోణాల్లోనూ విచారించిన పోలీసులు మూడు నెలల తర్వాత నాన్సీని అరెస్ట్ చేశారు. 


ఇది కూడా చదవండి..

భర్తను రోజూ చితకబాదుతున్న భార్య.. పరువు పోతుందని 9 ఏళ్లుగా ఎవరికీ చెప్పని భర్త.. కానీ హింస మరీ ఎక్కువ అవడంతో..


హత్య జరిగిన రోజు భర్త ఆఫీస్‌కు నాన్సీ వెళ్లినట్టు తేలడంతో పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు. అప్పట్నుంచి ఆమె జైలులోనే ఉన్నారు. ఆ ఘటనపై తాజాగా ముల్తోమహ్ కౌంటీ కోర్టు తుది తీర్పు వెలువరించింది. డానియేల్‌ను నాన్సీయే హత్య చేసిందని స్పష్టం కావడంతో కోర్టు ఆమెకు జీవిత ఖైదు విధించింది. ప్రస్తుతం నాన్సీ వయసు 72 సంవత్సరాలు. తీవ్ర ఆర్థిక ఇబ్బందులు తలెత్తడంతో ఇన్సూరెన్స్ డబ్బుల కోసమే భర్తను నాన్సీ హత్య చేసినట్టు తేలింది. నాన్సీ రాసిన `హౌ టు మర్డర్ యువర్ హజ్బెండ్`పుస్తకం 2011లో విడుదలైంది. సరిగ్గా ఏడేళ్ల తర్వాత ఆమె భర్తను హత్య చేసింది. 

Updated Date - 2022-05-27T20:51:10+05:30 IST