అధికారులు ఒత్తిడి చేస్తున్నారు

ABN , First Publish Date - 2021-03-03T05:19:05+05:30 IST

ఇంటింటి రేషన్‌ పంపిణీ కార్యక్రమంలో అధికారులు డీలర్లపై పరోక్షంగా ఒత్తిడి తెస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని జిల్లా రేషన్‌ డీలర్ల సంఘం అధ్యక్షుడు ప్రవీణ్‌ ఫిర్యాదు చేశారు.

అధికారులు ఒత్తిడి చేస్తున్నారు
జేసీకి సమస్యను వివరిస్తున్న రేషన్‌ డీలర్ల సంఘ నేతలు

 జేసీకి రేషన్‌ డీలర్ల సంఘ నేతలు ఫిర్యాదు


చిత్తూరు కలెక్టరేట్‌, మార్చి 2: ఇంటింటి రేషన్‌ పంపిణీ కార్యక్రమంలో అధికారులు డీలర్లపై పరోక్షంగా ఒత్తిడి తెస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని జిల్లా రేషన్‌ డీలర్ల సంఘం అధ్యక్షుడు ప్రవీణ్‌ ఫిర్యాదు చేశారు. మంగళవారం జేసీ మార్కొండేయులును ఆ సంఘ నేతలు కలిశారు.  మండల తహసీల్దార్లు ఎండీ యు, వీఆర్వో లాగిన్‌ల ద్వారా బియ్యం పంపిణీ చేయాలని ఒత్తిడి తెస్తున్నారని ఆరోపించారు.  స్టాక్‌ పాయింట్ల వద్ద డీలర్లకు ఇస్తున్న  సరుకుల్లో తూకం తేడా వస్తుందని, గోనెసంచి  580 గ్రాములుంటే గోతంతో కలిసి ఎంఎల్‌ పాయింట్లలో తూకం వేయడం వల్ల చాలా వ్యత్యాసం వస్తుందని సూచించారు. ఈ సమస్యలను వెంటనే పరిష్కరించాలని డీఎస్వో శివరామప్రసాద్‌ను జేసీ ఆదేశించారు.

Updated Date - 2021-03-03T05:19:05+05:30 IST