అధికారులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలి

ABN , First Publish Date - 2021-10-24T06:14:29+05:30 IST

మార్కెట్‌లో షెడ్లను తొలగించకుండా అధికారులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలని జనసేన పార్టీ రాష్ట్రప్రధాన కార్యదర్శి చిలకంమధుసూదన్‌రెడ్డి పేర్కొన్నారు.

అధికారులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలి
సమావేశంలో మాట్లాడుతున్న జనసేన, టీడీపీ, సీపీఎం, సీపీఐ నాయకులు

-వ్యాపారుల పొట్టకొట్టకండి..

-జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం

ధర్మవరం, అక్టోబరు 23: పట్టణంలోని కూరగాయల మార్కెట్‌ల్లో ఎన్నో ఏళ్లుగా వ్యాపారాలు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారని, అలాంటి మార్కెట్‌లో షెడ్లను తొలగించకుండా అధికారులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలని జనసేన పార్టీ రాష్ట్రప్రధాన కార్యదర్శి చిలకంమధుసూదన్‌రెడ్డి పేర్కొన్నారు. శనివారం కూరగాయల మార్కెట్‌ను సందర్శించి అక్కడ వ్యాపారులతో సమస్యను అడిగితెలుసుకున్నారు. మార్కెట్‌లోని షెడ్లను తొలగించకుండా ఇక్కడే కొనసాగించేలా టీడీపీ, సీపీఎం, సీపీఐతోపాటు తాము అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. రూ.10లక్షలు గుడ్‌విల్‌ చెల్లించాలని అధికారులు చెబుతున్నారని, రూ.3వేలు బాడుగు కట్టుకుని వ్యాపారులు చేసుకునే వారు రూ.10లక్షలు ఎక్కడి నుండి తెస్తారన్నారు. వ్యాపారులతో చర్చించి అభివృద్ధి చేయాలే కానీ పేదల నోట్లో దుమ్ముకొట్టవద్దన్నారు. అనంతపురానికి వెళ్లి ఈ విషయంపై జాయింట్‌కలెక్టర్‌ నిశాంత్‌కుమార్‌కు తెలియజేశారు. దీంతో స్పం దించిన జేసీ అధికారులతో చర్చించి వ్యాపారులకు న్యాయం చేసేలా చర్యలు తీసు కుంటామని హామీ ఇచ్చారని చిలకం పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మత్స్యకార వికాస విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బెస్తశ్రీనివాసులు, జనసేన నాయకులు శ్యాంకుమార్‌, రామాం జినే యులు, నాయుడూ నాయక్‌ తదితరులు పాల్గొన్నారు.

న్యాయం జరిగేవరకు పోరాడుతాం: విపక్షాలు

కూరగాయలమార్కెట్‌ వ్యాపారులకు న్యాయం జరిగే వరకు టీడీపీ, సీపీఎం,సీపీఐ ఆధ్వర్యంలో పోరాడుతామని ఆయా పార్టీ నాయకులు పేర్కొన్నారు. శనివారం ఉద యం మార్కెట్‌లో షెడ్లను తొలగించడానికి మున్సిపల్‌ అధికారులు జేసీబీలతో రావడంతో వారిని వ్యాపారులు, విపక్షాల నాయకులు అడ్డుకోవడంతో వారు వెనుతి రిగివెళ్లారు. షెడ్లను తొలగించడానికి వస్తే ఆత్మహత్య చేసుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నామని వ్యాపారులు తెలిపారు. అనంతరం సీపీఎం, సీపీఎం నాయకులు పోలా రామాంజినేయులు, జంగాలపల్లిపెద్దన్న, జింకా చలపతిలు మాట్లాడుతూ.. ప్రస్తుతం నిర్వహిస్తున్న మార్కెట్‌స్థలం గతంలో పంచాయతీగా ఉన్నప్పుడు  ఓ దాత వ్యాపా రుల కోసం దారాదత్తం చేశారన్నారు. ఇందులో అధికారుల పెత్తనం ఏమిటో అర్థంకా లేదన్నారు. అనంతరం మార్కెట్‌లోనే వంటవార్పు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్ర మంలో టీడీపీ నాయకులు కమతం కాటమయ్య, పురుషోత్తంగౌడ్‌, మేకలరా మాంజినేయులు, మహేశ్‌చౌదరి, భీమనేని ప్రసాద్‌నాయుడు, అంబటి సనత్‌కుమార్‌, చిగిచెర్ల రాఘవరెడ్డి, పరిశేసుఽధాకర్‌, రాంపురంశీన,డిష్‌లచ్చి, జమీర్‌అహమ్మద్‌, చీమల రామాంజి, బాబూఖాన్‌, చీమలనాగరాజు, చిన్నూరు విజయ్‌, గంగారపురవి, పల్లపుర వి, పల్లపుశివశంకర్‌, కత్తులబాబ్జీ, అశ్వర్థనాయుడు, సాకేకుళ్లాయప్ప, పోతు కుంట రవి, పోతుకుంట రమేశ్‌, రేనాటిశీన, సాకేశివయ్య, చికెన్‌రాము, చీమలమహేశ్‌, మా రుతీస్వామి, ఇర్షాద్‌, తోటవాసుదేవ, అశోక్‌, చింతమేకలశీన, చింతాశీన, సీపీఐ నాయ కులు వెంకటనారాయణ, వై.రమణ, వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-10-24T06:14:29+05:30 IST