Advertisement

ధాన్యం కుప్పను ఢీకొని ఆటో బోల్తా

Nov 29 2020 @ 00:11AM

13 మంది కూలీలకు గాయాలు


తూప్రాన్‌రూరల్‌, నవంబరు 28: మండల పరిధిలోని నాగులపల్లి శివారులోని జెండాపల్లి వద్ద శనివారం రాత్రి జరిగిన ప్రమాదంలో ఆటో డ్రైవర్‌ సహా 13 మంది మహిళా కూలీలకు గాయాలయ్యాయి. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం వెల్దుర్తి కిందివాడకు చెందిన మహిళలు మేడ్చల్‌ మండలం డబిల్‌పూర్‌ శివారులోని లిక్కర్‌ కంపెనీలో పనిచేయడానికి ప్రతీరోజు ఆటోలో వస్తుంటారు. శనివారం సాయంత్రం విధులు ముగిసిన అనంతరం మహిళలు ఆటోలో వెల్దుర్తికి వెళ్తున్నారు. మార్గమధ్యలోని జెండాపల్లి వద్ద రోడ్డుపై ధాన్యంకుప్పను ఢీకొన్న ఆటో బోల్తా పడింది. దీంతో ఆటో డ్రైవర్‌తో సహా అందరికీ గాయాలయ్యాయి. ప్రమాదంలో గాయపడిన మౌనిక, లలిత, పద్మ, మహేశ్వరి, గీత, రేణుక, లావణ్య, సులోచన, వెంకమ్మ, నాగరాణి తదితరులను స్థానికులు తూప్రాన్‌లోని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. 

Follow Us on:
Advertisement