ఆటోపై పడిన చెట్టు: మహిళ సహా ఇద్దరి మృతి

Published: Fri, 06 May 2022 10:26:44 ISTfb-iconwhatsapp-icontwitter-icon
ఆటోపై పడిన చెట్టు: మహిళ సహా ఇద్దరి మృతి

పెరంబూర్‌(చెన్నై): తిరునల్వేలి జిల్లా పత్తమడైలో ఆటోపై చెట్టు పడిన ఘటనలో మహిళ సహా ఇద్దరు మృతిచెందారు. పాళయంకోట నుంచి అంపాసముద్రం వరకు రోడ్డు విస్తరణ పనులు జరుగుతున్నాయి. గురువారం ఉదయం పనులకు అడ్డంగా ఉన్న చెట్లను తొలగించే పనులు చేపట్టారు. ఓ చెట్టు తొలగించే సమయంలో హఠాత్తుగా రోడ్డుపై ఒరిగి పోయింది. ఆ సమయంలో అటుగా వచ్చిన ఆటోపై చెట్టు పడింది. ఈ ఘటనలో ఆటో డ్రైవర్‌ ఖాదర్‌, రహమత్‌ అనే మహిళ సంఘటనా స్థలంలోనే మృతిచెందగా, మరో ముగ్గురికి గాయాలయ్యాయి. రోడ్డు విస్తరణ పనులపై అధికారులు ఎటువంటి హెచ్చరిక లేకుండానే పనులు ప్రారంభించడంతో ఈ ప్రమాదం జరిగిందంటూ ఆరోపిస్తూ మృతుల బంధువులు రాస్తారోకో చేపట్టడంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. పోలీసు, రెవెన్యూ, రహదారులశాఖ అధికారులు ఆందోళనకారులతో చర్చలు జరిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు.

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.