కనిష్ఠంగా రూ.40

Published: Thu, 09 Jun 2022 10:44:13 ISTfb-iconwhatsapp-icontwitter-icon
కనిష్ఠంగా రూ.40

- కిలోమీటర్‌కు రూ.18

- ఆటో చార్జీలపై ప్రభుత్వ కమిటీ సిఫారసు

 

చెన్నై, జూన్‌ 8 (ఆంధ్రజ్యోతి): త్వరలో ఆటో చార్జీలు పెరగడం ఖాయమైపోయింది. ఆటోకు కనిష్ఠంగా రూ.40, ఆ తరువాత కి.మీటరుకు రూ.18 చొప్పున వసూలు చేయొచ్చంటూ రాష్ట్ర ప్రభుత్వం నియమించిన కమిటీ సిఫారసు చేసింది. ఆటో చార్జీల ఖరారు కోసం హైకోర్టు ఆదేశాల మేరకు ఏప్రిల్‌లో రాష్ట్ర రవాణాశాఖ ఓ కమిటీని నియమించిన విషయం తెలిసిందే. ఆటోడ్రైవర్లు, యజమానులు, వినియోగదారులతో పాటు వివిధ వర్గాలవారితో భేటీ అయిన ఆ కమిటీ ఇటీవల ప్రభుత్వానికి పలు సూచనలు చేస్తూ నివేదిక సమర్పించింది. 2013 ఆగస్టులో చివరిగా రాష్ట్ర ప్రభుత్వం ఆటో చార్జీలను పునరుద్ధరించింది. కనిష్ఠంగా రూ.25, ప్రతి కి.మీటరుకు రూ.12, వెయిటింగ్‌ చార్జీ రూ.3.50గా అప్పట్లో రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేసింది. ఆ తరువాత మళ్లీ ఇప్పుడు ఆటో చార్జీల పెంపుపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. కమిటీ సిఫార్సులను పరిశీలించి త్వరలోనే నిర్ణయం తీసుకోనుంది.

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.