ఏలేరు కాలువలోకి దూసుకుపోయిన ఆటో

ABN , First Publish Date - 2022-01-18T05:53:33+05:30 IST

మండలంలోని మోసయ్యపేట గ్రామం వద్ద ఏలేరు కాలువలోకి ఆటో దూసుకుపోయింది. అయితే ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరి తీసుకున్నారు.

ఏలేరు కాలువలోకి దూసుకుపోయిన ఆటో
ఏలేరు కాలువలోకి దూసుకెళ్లిన ఆటోను చూస్తున్న స్థానికులు

తప్పిన పెను ప్రమాదం... ఊపిరి తీసుకున్న జనం


కశింకోట, జనవరి 17: మండలంలోని మోసయ్యపేట గ్రామం వద్ద ఏలేరు కాలువలోకి ఆటో దూసుకుపోయింది. అయితే ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరి తీసుకున్నారు. తాళ్లపాలెం వైపునకు వస్తున్న ఆటో, మార్గమధ్యంలో ఏలేరుకాలువలోకి అదుపుతప్పి దూసుకెళ్లింది. ప్రమాదాన్ని ముందుగానే పసిగట్టిన డ్రైవర్‌, ఆటోలో ఉన్న ప్రయాణికులను అప్రమత్తం చేసి కిందికి దూకాలని సూచించాడు. దీంతో అందరూ దూకేసి ప్రాణాలను కాపాడుకున్నారు. అనంతరం ఆటో ఏలేరు కాలువలో పడింది. నీటిప్రవాహానికి ఆటో కొంతదూరం కొట్టుకుపోయింది. స్థానికులు తాళ్ల సాయంతో ఆటోను బయటకు తీశారు. ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరి తీసుకున్నారు. 

Updated Date - 2022-01-18T05:53:33+05:30 IST