22,527 మందికి వాహనమిత్ర సాయం

ABN , First Publish Date - 2021-06-16T05:22:46+05:30 IST

ఆటో డ్రైవర్లకు ప్రభుత్వం అండగా ఉంటుందని ముఖ్యమంత్రి జగన్‌మోహనరెడ్డి అన్నారు.

22,527 మందికి వాహనమిత్ర సాయం
ఆటోల ర్యాలీని ప్రారంభిస్తున్న రాష్ట్ర హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత

చెక్కులను అందజేసిన హోంమంత్రి సుచరిత 


గుంటూరు(తూర్పు), జూన్‌15:  ఆటో డ్రైవర్లకు ప్రభుత్వం అండగా ఉంటుందని ముఖ్యమంత్రి జగన్‌మోహనరెడ్డి అన్నారు. ఆటో, క్యాబ్‌, మ్యాక్సీ డ్రైవర్లు, యజమానులకు ప్రభుత్వం వాహనమిత్ర ద్వారా అందించే ఆర్థిక సాయాన్ని మంగళవారం తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి ఆన్‌లైన్‌ ద్వారా వారి ఖాతాల్లో జమ చేశారు. గుంటూరులో ఈ కార్యక్రమంలో పాల్గొన్న హోంమంత్రి మేకతోటి సుచరిత మాట్లాడుతూ వాహనమిత్ర అందించే ఆర్థిక సాయం వాహనాల బీమా, మరమ్మత్తులు, ఫిట్‌నెస్‌ వంటి వాటికి ఉపయోగపడుతుందన్నారు. ఆటోడ్రైవర్లు ట్రాఫిక్‌ నిబంధనలు పాటించాలని, మద్యం తాగి వాహనాలు నడపరాదని సూచించారు. కలెక్టర్‌ వివేక్‌యాదవ్‌ మాట్లాడుతూ వాహనమిత్ర పఽథకం ద్వారా జిల్లాలో 22,527 మంది లబ్ధిదారులకు రూ.10 వేలు చొప్పున రూ.22.527 కోట్లు ప్రభుత్వం జమచేసినట్లు తెలిపారు. సంక్షేమ పధకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అనంతరం లబ్ధిదారులతో జిల్లా రవాణా శాఖ ఏర్పాటు చేసిన ఆటో ర్యాలీని కలెక్టర్‌ తో కలిసి, హోంమంత్రి జెండా ఊపి ప్రారంభించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీలు జంగా కృష్ణమూర్తి, కేఎస్‌ లక్ష్మణరావు, కల్పలత, ఎమ్మెల్యేలు ముస్తాఫా, మద్దాళి గిరిధర్‌, నంబూరు శంకరరావు, బొల్లా బ్రహ్మనాయుడు, మేయర్‌ కావటి మనోహర్‌నాయుడు, జేసీలు దినేష్‌కుమార్‌, పి.ప్రశాంతి, ట్రైనీ కలెక్టర్‌ శుభం భన్సాల్‌, డీఆర్వో కొండయ్య, జిల్లా ఉపరవాణ కమిషనర్‌ ఈ.మీరాప్రసాదు తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-06-16T05:22:46+05:30 IST