రాత్రయినా ఇంటికి రాని భర్త.. పొద్దున్నే తలుపు తీసిన భార్య.. ఇంటి ముందు పార్క్ చేసి ఉన్న ఆటోలో..

ABN , First Publish Date - 2021-11-17T15:27:41+05:30 IST

బీహార్‌లోని జుముయ్ జిల్లాలో ఒక ఆటో డ్రైవర్..

రాత్రయినా ఇంటికి రాని భర్త.. పొద్దున్నే తలుపు తీసిన భార్య.. ఇంటి ముందు పార్క్ చేసి ఉన్న ఆటోలో..

బీహార్‌లోని జుముయ్ జిల్లాలో ఒక ఆటో డ్రైవర్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. అతని మృతదేహం వారి ఇంటిముందు ఉన్న ఆటోలోనే కనిపించడం కలకలంరేపింది. ఈ ఉదంతం ఖైరా పోలీస్ స్టేషన్ పరిధిలోని దేవ్లాటాండ్ గ్రామంలో చోటుచేసుకుంది. మృతుడు 16 ఏళ్ల క్రితం ముస్లిం యువతి సబీనా ఖాతూన్‌ను వివాహం చేసుకుని, తన మతం మార్చుకున్నాడు. మృతుని కుటుంబీకులు ఈ ఘటన విద్యుత్ షాక్ కారణంగా జరిగిందంటుండగా, అతని భార్య సబీనా.. తన భర్త భూవివాదాల కారణంగా హతమయ్యాడని ఆరోపిస్తోంది. సమాచారం అందగానే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు.  


మీడియాకు అందిన సమాచారం ప్రకారం జుమాయీలోని ఉంఝడీకి చెందిన పవన్ సింగ్ 2005లో సబీనా ఖాతూన్‌ను ప్రేమ వివాహం చేసుకున్నాడు. తరువాత తన మతం మార్చుకుని తన పేరును రాజా అన్సారీగా మార్చుకున్నాడు. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు. అతను అత్తవారింటిలో ఉంటూ ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. రోజూ మాదిరిగానే పవన్ సింగ్ ఉరఫ్ రాజా అన్సారీ తన ఆటోను తీసుకుని ఉదయాన్నే ఇంటి నుంచి బయలుదేరాడు. పొద్దుపోయినప్పటికీ ఇంటికి తిరిగిరాలేదు. అయితే రాజా అన్సారీ భార్య భార్య.. తన భర్త అతని చెల్లెలి ఇంటికి వెళ్లివుంటాడని భావించింది. అతను విద్యుదాఘాతానికి గురయ్యాడని అతని సోదరి తెలిపింది. అయితే మర్నాటి ఉదయం సబీనా ఇంటి తలుపు తెరిచి చూసేసరికి ఆలోలోని వెనుక సీటులో భర్త మృతదేహం కనిపించింది. ఈ సమాచారాన్ని వెంటనే ఆమె పోలీసులకు తెలియజేసింది. తన భర్తను తన మరిది హత్య చేసి ఉంటాడని, భూ వివాదాలే దీనికి కారణమని ఆరోపించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

Updated Date - 2021-11-17T15:27:41+05:30 IST