అద్దెకు గది కావాలన్న 14 ఏళ్ల బాలిక.. అనుమానంతో వివరాలు అడిగితే ఆమె చెప్పింది విని ఆ ఆటో డ్రైవర్ ఏం చేశాడంటే..

ABN , First Publish Date - 2022-01-31T22:37:46+05:30 IST

మహారాష్ట్రలోని వసాయి రైల్వే స్టేషన్‌ నుంచి బయటకు వచ్చిన ఓ బాలిక నేరుగా ఆటో స్టాండ్ దగ్గరకు వెళ్లింది..

అద్దెకు గది కావాలన్న 14 ఏళ్ల బాలిక.. అనుమానంతో వివరాలు అడిగితే ఆమె చెప్పింది విని ఆ ఆటో డ్రైవర్ ఏం చేశాడంటే..

మహారాష్ట్రలోని వసాయి రైల్వే స్టేషన్‌ నుంచి బయటకు వచ్చిన ఓ బాలిక నేరుగా ఆటో స్టాండ్ దగ్గరకు వెళ్లింది.. తనకు అద్దెకు ఓ గది కావాలని, తెలిస్తే చెప్పమని అడిగింది.. ఒంటరిగా కనిపించిన బాలికతో వేరెవరైనా అయితే అసభ్యంగా ప్రవర్తించేవారే.. కానీ, ఆ ఆటోడ్రైవర్ అలా చెయ్యలేదు.. ఆమె గురించి ఆరా తీశాడు.. బాలిక ఇంటి నుంచి పారిపోయి వచ్చిందని తెలుసుకుని తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చాడు.. తిరిగి ఆమెను ఇంటికి చేర్చాడు. 


వసాయి రైల్వే స్టేషన్‌ వద్ద రాజు కర్వాడే (35) అనే ఆటోడ్రైవర్‌‌ వద్దకు గత గురువారం ఓ బాలిక (14) వచ్చి తాను ఉండేందుకు అద్దె ఇంటి గురించి అడిగింది. రాజు ఆ బాలికకు సంబంధించిన వివరాలను తెలుసుకున్నాడు. ఆ బాలిక తల్లిదండ్రులతో గొడవపడి ఇంటినుంచి పారిపోయివచ్చిందని, ఆమెది ఢిల్లీ అని తెలుసుకున్నాడు. ఆ బాలికను నేరుగా మానిక్‌పూర్‌ పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లాడు. ఆ బాలిక నుంచి వివరాలు సేకరించిన పోలీసులు ఢిల్లీలోని సాకేత్‌ పోలీసులకు సమాచారం అందించారు. 


అప్పటికే ఆ బాలిక తల్లిదండ్రులు తమ కూతురు తప్పిపోయిందని సాకేత్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో సాకేత్ పోలీసులకు మానిక్‌పూర్ పోలీసులు బాలికకు సంబంధించిన వివరాలు చెప్పారు. వారు వచ్చి బాలికను ఢిల్లీ తీసుకెళ్లి ఆమె తల్లిదండ్రులకు అప్పగించారు. బాలికను క్షేమంగా అప్పగించిన ఆటో డ్రైవర్ రాజును మానిక్‌పూర్ పోలీసులు అభినందించారు.

Updated Date - 2022-01-31T22:37:46+05:30 IST