బెంగళూరులో ఈ రేట్లు త్వరలో పెరగనున్నాయట!

ABN , First Publish Date - 2021-10-01T01:29:54+05:30 IST

కర్ణాటక రాజధాని బెంగళూరులో ఇకపై ఆటో ఎక్కాలంటే భయపడడం ఖాయం. అక్కడ

బెంగళూరులో ఈ రేట్లు త్వరలో పెరగనున్నాయట!

బెంగళూరు: కర్ణాటక రాజధాని బెంగళూరులో ఇకపై ఆటో ఎక్కాలంటే  భయపడడం ఖాయం. అక్కడ ఇకపై ఎక్కిదిగితే రూ. 30 వదిలించుకోవాల్సి ఉంటుంది. ఈ మేరకు రవాణా శాఖ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం రూ. 25గా ఉన్న కనీస ధరను రూ. 30కి పెంచాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఆటో చార్జీలు పెంచాలన్న ప్రతిపాదనపై ఇటీవల ఆటో యూనియన్లతో సమావేశమైనట్టు బెంగళూరు అర్బన్ జిల్లా కమిషనర్, రవాణా ట్రాన్స్‌పోర్ట్ అథారిటీ చైర్మన్ జె. మంజునాథ్ తెలిపారు.

 

2013లో చివరిసారి ప్రభుత్వం ఆటో రిక్షాల చార్జీలను పెంచినట్టు రవాణా మంత్రి బి.శ్రీరాములు తెలిపారు. ఆటో యూనియన్లు చార్జీలు పెంచాలని కోరతున్నాయని, ఈ ప్రతిపాదనపై ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మైతో చర్చిస్తామని పేర్కొన్నారు. 


గత కొన్ని సంవత్సరాలుగా ఎల్పీజీ ధరలు కూడా దారుణంగా పెరిగిపోతున్నాయని, లీటరు ఎల్పీజీ గ్యాస్ ధర 2013లో రూ. 28గా ఉంటే ప్రస్తుతం రూ. 49.95గా ఉందని ఆటో రిక్షా డ్రైవర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి సీఎన్ శ్రీనివాస్ తెలిపారు. దీంతో కనీస చార్జీని పెంచాలని ప్రభుత్వాన్ని కోరినట్టు చెప్పారు. అలాగే, లాక్‌డౌన్ ప్రభావం కూడా ఆటో డ్రైవర్లపై దారుణంగా పడిందని శ్రీనివాస్ పేర్కొన్నారు. 

Updated Date - 2021-10-01T01:29:54+05:30 IST