ltrScrptTheme3

ఆటో బోల్తా .. ఇద్దరు మహిళల దుర్మరణం

Oct 27 2021 @ 00:51AM

గుమ్మఘట్ట, అక్టోబరు 26: మండలంలోని 75 వీరాపురం వద్ద మంగళవారం సాయంత్రం ఆటో బోల్తాపడిన ప్రమాదంలో ఇద్దరు మహిళలు మరణించారు. కేపీదొడ్డి గ్రామంలో ఒకే కుటుంబానికి చెందిన శివమ్మ (50), గొల్ల లక్ష్మీదేవి (35),  గొల్ల నాగమ్మ ఆటోలో వేరుశనగ బస్తాలతో రాయదుర్గానికి మంగళవారం సాయంత్రం బయలుదేరారు. 75 వీరాపురం తండా సమీపంలో కొండ వద్ద రోడ్డుకు గేదెలు అడ్డురావడంతో వాటిని తప్పించబోయి ఆటో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో గొల్ల శివమ్మ, గొల్ల లక్ష్మీదేవి అక్కడికక్కడే మరణించారు. 

గొల్ల నాగమ్మ తీవ్రంగా గాయపడటంతో రాయదుర్గం ప్రభుత్వాస్పత్రికి, అక్కడి నుంచి అనంతపురం తరలించారు. 9వ తరగతి చదివే కల్పన, 2వ తరగతి చదివే తను స్వల్పగాయాలతో బయటపడ్డారు. ప్రమాదంతో కేపీదొడ్డి గ్రామం విషాదంలో మునిగిపోయింది. కర్ణాటకలో నివాసముండే శివమ్మ దసరా పండుగ నిమిత్తం పుట్టినిల్లు కేపీదొడ్డికి వచ్చింది. లక్ష్మీదేవికి ఇద్దరు కుమారులు, కు మార్తె. మృతదేహాలను రాయదుర్గం ప్రభుత్వాస్పత్రికి తరలిం చారు. కేసు దర్యాప్తులో ఉన్నట్లు ఎస్‌ఐ తిప్పయ్యనాయక్‌ తె లిపారు.


తాడిపత్రిలో యువకుడు..

తాడిపత్రిటౌన: స్థానిక కడప రోడ్డులోని రాముని గుడి వద్ద మంగళవారం రోడ్డు ప్రమాదంలో గౌతమ్‌ (17) మరణించాడు. గన్నెవారిపల్లికాలనీ వాసి ఓబులేసు కుమారుడు గౌతమ్‌ పట్టణంలోని ఓ బేకరీ షాపులో పనిచేస్తుండేవాడు. పని ముగించుకొని ద్విచక్రవాహనంలో ఇంటికి వెళ్తుండగా ముందు వెళ్తున్న కారు ఒక్కసారిగా ఆపి డోర్‌ తీయగా గౌతమ్‌ బైక్‌ ఢీకొని కిందపడ్డాడు. వెనుకవైపు నుంచి వచ్చిన లారీ గౌతమ్‌పై నుంచి దూ సుకెళ్లడంతో అతను అక్కడికక్కడే మరణించాడు. మృతదేహాన్ని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తులో ఉంది.


Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.