మేడమ్! ఆటోలో పెట్రోల్ అయిపోయింది.. పట్టుకొస్తానంటూ వెళ్లాడు.. తర్వాత స్నేహితుడితో కలిసి వచ్చి..

Published: Sat, 26 Mar 2022 21:59:41 ISTfb-iconwhatsapp-icontwitter-icon
మేడమ్! ఆటోలో పెట్రోల్ అయిపోయింది.. పట్టుకొస్తానంటూ వెళ్లాడు.. తర్వాత స్నేహితుడితో కలిసి వచ్చి..ప్రతీకాత్మక చిత్రం

రాత్రి వేళ ప్రయాణమంటేనే కొందరు ఒకటికి పదిసార్లు ఆలోచిస్తారు. కొన్నిసార్లు ఎంత రాత్రయినా వెళ్లక తప్పని పరిస్థితి వస్తుంది. అలాంటి సందర్భాల్లో అప్పుడప్పుడూ అనుకోని ఘటనలు జరుగుతుంటాయి. ఇలాంటి సమయాల్లో మహిళల విషయంలో చాలా దారుణాలు జరగడం ఇటీవల చాలా చూశాం. పట్టపగలే మహిళలకు భద్రత లేని నేటి సమాజంలో రాత్రి వేళ ఒంటరిగా కనబడితే.. మానప్రాణాలపై ఆశలు వదులుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. దేశ రాజధాని ఢిల్లీలో తాజాగా ఓ మహిళకు ఇలాంటి అనుభవమే ఎదురైంది.

ఢిల్లీకి చెందిన ఓ మహిళ స్థానికంగా ఉన్న ఒక కంపెనీలో పని చేస్తోంది. రోజూ మాదిరే బుధవారం కూడా ఆఫీసుకు వెళ్లింది. అయితే పని ముగిసే సరికి రాత్రి కావడంతో ఎలాగైనా ఇంటికి వెళ్లాలనే ఉద్దేశంతో ఓ ఆటో ఎక్కింది. మహిళ ఒంటరిగా ఆటో ఎక్కడంతో డ్రైవర్.. ఆమెపై కన్నేశాడు. కొంచెం దూరం వెళ్లిన తర్వాత ఉన్నట్టుండి ఆటోను నిలిపేశాడు. దీంతో ‘‘ఏంటి! మధ్యలో ఆటోను ఆపావ్’’.. అంటూ మహిళ ప్రశ్నించింది. ‘‘మేడమ్! ఆటోలో పెట్రోల్ అయిపోయింది.. మీరు కూర్చునే ఉండండి.. నేను వెళ్లి పెట్రోల్ తీసుకొస్తా’’.. అంటూ అక్కడి నుంచి వెళ్లాడు.

అర్ధరాత్రి ఒంటరిగా వెళ్తున్న తల్లీకొడుకును అడ్డుకున్న వ్యక్తులు.. అరిస్తే చంపేస్తామంటూ బెదిరించి.. చివరకు..

అతడి మాటలు నమ్మిన మహిళ ఆటోలోనే ఉండిపోయింది. బయటికి వెళ్లిన డ్రైవర్.. కాసేపటికి తన స్నేహితుడితో కలిసి అక్కడికి వచ్చాడు. అప్పటికే భయంతో ఉన్న మహిళ.. ఇద్దరినీ చూసి మరింత భయపడింది. అంతలోనే ఇద్దరూ ఆమెను బెదిరించి, నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లారు. అనంతరం నోరు మూసి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. తర్వాత అక్కడి నుంచి పరారయ్యారు. ఎలాగోలా ఇంటికి చేరుకున్న ఆమె.. మరుసటి రోజు పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుల కోసం గాలిస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది.

అన్నాదమ్ములిద్దరికీ పెళ్లి ఫిక్స్.. పెళ్లి రోజు బంధువులతో సహా వధువుల ఇంటికి.. తీరా అక్కడ సీన్ చూసి..

ఇవి కూడా చదవండిLatest News in Telugu

ఎంతసేపు టీవీ చూస్తావ్! బయటికి రా.. అంటూ పిలిచిన భార్య.. ఎంతసేపటికీ రాలేదని ఇంట్లోకి వెళ్లి..‘‘మీ నాన్న నాకు చాలా క్లోజ్’’.. అంటూ పరిచయం చేసుకున్నాడు.. పనుందంటూ బాలికను పాఠశాల వాష్‌రూమ్‌లోకి తీసుకెళ్లి..ఆడుకుని వస్తానంటూ వెళ్లి.. ఇంటికి రాని విద్యార్థి, అదే రోజు టీచర్ కూడా అదృశ్యం.. ఆరాతీయగా చివరికి తెలిసింది ఏంటంటే..తల్లిపాలతో ఆభరణాల తయారీపై దృష్టి.. వచ్చే ఏడాదికి రూ.15కోట్ల టర్నోవర్ చేయడమే ఆ దంపతుల లక్ష్యం..అదృష్టమంటే వీడిదే.. అంత పెద్ద ప్రమాదం నుంచి క్షేమంగా బయటపడ్డాడు.. ఒక్క క్షణం ఆలస్యం అయ్యున్నా..videoసెకండ్ షోకు వెళ్లిన వైద్యురాలు, ఆమె స్నేహితుడు.. అర్ధరాత్రి ఇంటికి వెళ్లే క్రమంలో ఆటో ఎక్కడంతో..
Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

ప్రత్యేకంLatest News in Teluguమరిన్ని...

Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.