రత్నగిరి కొండపైకి ఆటోలు నిషేధం

ABN , First Publish Date - 2021-10-18T05:43:18+05:30 IST

సత్యదేవుని సన్నిధికి బస్సు, రైళ్లల్లో వచ్చే భక్తులు ఇప్పటివరకు ఆటోలో చేరుకునే విధానానికి దేవదాయ శాఖ కమిషనర్‌ తాజా ఉత్తర్వులతో గండిపడింది. మోటార్‌ వెహికల్‌ చట్టం సవరణల ప్రకారం మూడుచక్రాల వాహనాలు ఘాట్‌ రోడ్డుపైకి అనుమతి నిషేధం అని స్పష్టంగా ఉన్నా రాజకీయ ఒత్తిళ్లు, స్థానికంగా కలిగే ఇబ్బందుల నేపథ్యంలో దేవస్థానం అధికారులు చూసీచూడనట్టుగా ఆటోలను కొండపైకి వదిలేసేవారు.

రత్నగిరి కొండపైకి ఆటోలు నిషేధం
దేవస్థానం గ్యారేజీలో బస్సులు

  • ఉత్తర్వులు జారీ చేసిన దేవదాయ శాఖ కమిషనరు 
  • అస్తవ్యస్తంగా అన్నవరం దేవస్థానం రవాణా విభాగం 
  • దు బస్సుల్లో రెండింటికి మరమ్మతులు 
  • మిగిలిన మూడింటికి స్వల్ప లోపాలు
  • ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకుంటే కార్తీక మాసంలో భక్తులకు కష్టాలే

అన్నవరం, అక్టోబరు 17: సత్యదేవుని సన్నిధికి బస్సు, రైళ్లల్లో వచ్చే భక్తులు ఇప్పటివరకు ఆటోలో చేరుకునే విధానానికి దేవదాయ శాఖ కమిషనర్‌ తాజా ఉత్తర్వులతో గండిపడింది. మోటార్‌ వెహికల్‌ చట్టం సవరణల ప్రకారం మూడుచక్రాల వాహనాలు ఘాట్‌ రోడ్డుపైకి అనుమతి నిషేధం అని స్పష్టంగా ఉన్నా రాజకీయ ఒత్తిళ్లు, స్థానికంగా కలిగే ఇబ్బందుల నేపథ్యంలో దేవస్థానం అధికారులు చూసీచూడనట్టుగా ఆటోలను కొండపైకి వదిలేసేవారు. అయితే తాజాగా కమిషనర్‌ కార్యాలయం ఉత్తర్వులతో ఆదివారం నుంచి ఆటోలను పూర్తిగా నిలుపుదల చేసినట్టు పీఆర్వో కొండలరావు తెలిపారు. ఇదిలా ఉండగా ప్రస్తుతం దేవస్థానం రవాణా వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. దిశానిర్దేశం లేకుండా ఉండడంతో కొన్ని బస్సులు తరచూ మరమ్మతులకు గురవుతున్నాయి. ప్రస్తుతం వున్న ఐదు బస్సుల్లో రెండు పాడై మూలనపడి ఉన్నాయి. మిగిలిన మూడింటికి స్వల్ప మరమ్మతులు ఉన్నా నెట్టుకొస్తున్నారు. ఒకపక్క ఆటోల నిషేధం, మరోపక్క బస్సుల మరమ్మతులతో రానున్న కార్తీక మాసంలో భక్తులకు కష్టాలు తప్పేలా లేవు. దీంతో ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించాల్సిందే. అధికారులు ఏ విధంగా వ్యవహరిస్తారో వేచి చూడాలి.

Updated Date - 2021-10-18T05:43:18+05:30 IST