అపర భగీరథుడు సర్‌ ఆర్ధర్‌ కాటన్‌

ABN , First Publish Date - 2021-07-26T05:52:34+05:30 IST

దక్షిణ భారతీయుల పాలిట అపర భగీరధుడు సర్‌ ఆర్ధర్‌ కాటన్‌ దొర అని అవగాహన సంస్థ కార్యదర్శి కొండా శివరామిరెడ్డి పేర్కొన్నారు.

అపర భగీరథుడు సర్‌ ఆర్ధర్‌ కాటన్‌
మాట్లాడుతున్న కొండా శివరామిరెడ్డి తదితరులు

గుంటూరు, జూలై 25: దక్షిణ భారతీయుల పాలిట అపర భగీరధుడు సర్‌ ఆర్ధర్‌ కాటన్‌ దొర అని అవగాహన సంస్థ కార్యదర్శి కొండా శివరామిరెడ్డి పేర్కొన్నారు. అరండల్‌పేటలోని సంస్థ కార్యాలయంలో ఆర్ధర్‌ కాటన్‌ వర్ధంతి కార్యక్రమం ఆదివారం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్షాలు సమయానికి పడక, పంటలు పండక, కరువు కాటకాలతో అష్టకష్టాలు పడే రోజుల్లో దక్షిణ భారతీయుల పాలిట వరంగా కాటన్‌ దొర వచ్చి కావేరి, గోదావరి, కృష్ణా నదులపై ఆనకట్టలు కట్టి అపరభగీరఽధుడయ్యారని కీర్తించారు. ఆంధ్రప్రదేశ్‌ సస్య శ్యామలంగా పచ్చనిపంటలతో ధాన్యాగారంగా గుర్తింపు వచ్చిందంటే దానికి కాటన్‌ దూరదృష్టేనని నిస్సందేహంగా చెప్పవచ్చన్నారు. అనంతరం కాటన్‌ చిత్రపటానికి పూలమాలలతో నివాళులర్పించారు. కార్యక్రమంలో ఇంజనీర్‌ సదాశివం, ఘనశ్యామాచార్యులు, సుబ్బారెడ్డి, మురళీకృష్ణ తదితరులున్నారు. 


Updated Date - 2021-07-26T05:52:34+05:30 IST