ఇసుక లభ్యత కష్టం.. సిమెంట్‌ ధర పైపైకి

ABN , First Publish Date - 2022-05-20T06:13:29+05:30 IST

ఇసుక లభ్యత కష్టంగా ఉందని, సిమెంట్‌ ధరలు ఆకాశాన్నంటుతున్నాయని స్థానికులు ఎమ్మెల్యే మొండితోక జగన్‌మోహనరావు ఎదుట ఆవేదన వ్యక్తంచేశారు.

ఇసుక లభ్యత కష్టం.. సిమెంట్‌ ధర పైపైకి
ఇసుక, సిమెంట్‌పై ఎమ్మెల్యే జగన్‌మోహనరావుతో మాట్లాడుతున్న మహిళలు

కంచికచర్ల గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యే జగన్‌మోహనరావు దృష్టికి ప్రజలు

కంచికచర్ల రూరల్‌, మే 19: ఇసుక లభ్యత కష్టంగా ఉందని, సిమెంట్‌ ధరలు ఆకాశాన్నంటుతున్నాయని స్థానికులు ఎమ్మెల్యే మొండితోక జగన్‌మోహనరావు ఎదుట ఆవేదన వ్యక్తంచేశారు. దీనిపై ఆయన స్పందిస్తూ ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి పాలన సాగిస్తున్నారని ఎమ్మెల్యే అన్నారు.  ఇసుక లభ్యత ప్రభుత్వ పాలసీ మేరకు అందిస్తున్నారని, ఇక సిమెంట్‌ ధరలు దేశ వ్యాప్తంగా పెరుగుతున్నాయని ప్రజలకు వివరించారు. విషయాన్ని సీఎం  దృష్టికి తీసుకెళ్లన్నట్లు హామీ ఇచ్చారు. కంచికచర్ల 1వ సచివాలయం పరిధిలో గురువారం  గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు.  సంక్షేమ పథకాల కరపత్రాలను ప్రజలకు అందించి ప్రభుత్వ పని తీరును వివరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అన్ని వర్గాలకు సమన్యాయం చేసిన వ్యక్తి జగన్‌ అన్నారు. ఇక్కడి పథకాలు ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అమలు చేసేందుకు యత్నిస్తున్నాయన్నారు.  నాయకులు వేమా సురేష్‌ బాబు, మలక్‌ బషీర్‌, వేల్పుల సునీత, వేల్పుల ప్రశాంతి, మార్త రజనీ, లగడపాటి నాగేశ్వరరావు పాల్గొన్నారు. 


అన్ని వర్గాలకు సంక్షేమ ఫలాలు : ఉదయభాను 

జగ్గయ్యపేట రూరల్‌ : ఏ రాష్ట్రంలో కూడా ప్రజల సంక్షేమాన్ని పట్టించుకున్న దాఖలాలు లేవని, సీఎం జగన్‌మోహన్‌రెడ్డి అన్ని వర్గాలకు సంక్షేమ ఫలాలు అందిస్తున్నారని ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే సామినేని ఉదయభాను అన్నారు. గురువారం గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా చిల్లకల్లులో ఆయన పర్యటించారు.  వార్డుల్లో ప్రజా సమస్యలను తెలుసుకుని  శాఖల వారీగా సమస్యలు పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. అనంతరం ప్రభుత్వం ద్వారా అందిన సంక్షేమ వివరాల పత్రాలను లబ్ధిదారులకు అందించారు. కేడీసీసీ  బ్యాంకు చైర్మన్‌ తన్నీరు నాగేశ్వరరావు, ముత్తినేని విజయశేఖర్‌, సంపత విజిత, శ్రీనివాస్‌ గౌడ్‌, విజయ్‌కుమార్‌, తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2022-05-20T06:13:29+05:30 IST