అవంతికా మిశ్రా కోలీవుడ్ ఎంట్రీ

Jul 24 2021 @ 15:37PM

ఢిల్లీకి చెందిన మోడల్‌ అవంతికా మిశ్రా ‘మాయ’ అనే చిత్రం ద్వారా వెండితెరకు పరిచయమైంది. ఆ తర్వాత టాలీవుడ్‌లో అవకాశాలు  రాలేదు. కాగా ఇపుడు కోలీవుడ్‌లో ఈమెకు రెండు వరుస అవకాశాలు వచ్చాయి. వాటి ద్వారా ఆమె  కోలీవుడ్‌కు పరిచయం కానున్నారు. అందులో ఒకటి అశోక్‌ సెల్వల్‌ హీరోగా నటించే ‘నెంజమెల్లామ్‌ నీయే’ చిత్రం కాగా, మరొకటి అరుళ్‌ నిధి హీరోగా నిర్మించనున్న ‘డి బ్లాక్‌’ ఇందులో డి బ్లాక్‌ చిత్రం ముందుగా విడుదల కానుంది. ఈ మూవీలో ఉమా రియాజ్‌, తలైవాసన్‌ విజయ్‌, కరు పళనియప్పన్‌, లల్లూ, కదిర్‌ తదితరులు నటిస్తున్నారు.

గణేశ్‌ శివ సంగీతం సమకూరుస్తున్నారు. ఈ చిత్రం గురించి దర్శకుడు విజయ్‌ కుమార్‌ రాజేంద్రన్‌ మాట్లాడుతూ, ఇది థ్రిల్లర్‌ మూవీ. కాలేజీ స్టూడెంట్‌ పాత్రలో అరుళ్‌ నిధి నటిస్తున్నారు.  ఈ మూవీ ద్వారా అవంతికా మిశ్రా అనే ఢిల్లీ మోడల్‌ తమిళంలో హీరోయిన్‌ గా పరిచయమవుతోంది. అదేసమయంలో ఈ మూవీలో తాను కూడా హీరో అరుళ్‌ నిధి స్నేహితుడుగా ఒక చిన్న పాత్రలో కనిపించనున్నట్టు వివరించారు. కాగా అవంతిక మిశ్రా ‘ఎన్న సోల్లపోగియాయ్‌’ అనే చిత్రంలో కూడా నటిస్తున్నారు. ప్రస్తుతం ఈమె చేతిలో మూడు కోలీవుడ్‌ ప్రాజెక్టులున్నాయి.

Follow Us on:

Otherwoodsమరిన్ని...

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.