నిర్లక్ష్యం వద్దు: ఉద్ధవ్ థాకరే హెచ్చరిక

ABN , First Publish Date - 2021-09-05T21:48:59+05:30 IST

పండుగ సీజన్ ముందుడటం, మహారాష్ట్రలో కోవిడ్ కేసులు పెరుగుతుండటంపై ముఖ్యమంత్రి..

నిర్లక్ష్యం వద్దు: ఉద్ధవ్ థాకరే హెచ్చరిక

ముంబై: పండుగ సీజన్ ముందుడటం, మహారాష్ట్రలో కోవిడ్ కేసులు పెరుగుతుండటంపై ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే రాష్ట్ర ప్రజలను అప్రమత్తం చేశారు. థర్డ్ వేవ్‌ను సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధమవుతున్న తరుణంలో ఏ ఒక్కరూ నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దని సూచించారు. అందరూ అప్రమత్తంగా ఉండాలని అన్నారు. గత ఏడాది ఫెస్టివల్ సీజన్ తర్వాత కోవిడ్ కేసులు పెరిగాయని గుర్తు చేశారు. ఆ దృష్ట్యా ఒకేచోట జనం గుమిగూడవద్దని, జనంలోకి పోవద్దని, వ్యాక్సినేషన్ వేయించుకున్నప్పటికీ మాస్క్‌లు తప్పనిసరిగా ధరించాలని హెచ్చరించారు. డాక్టర్స్ కాన్ఫరెన్స్‌ను ఉద్దేశించి  ఆదివారం జరిపిన వర్చువల్ మీటింగ్‌లో థాకరే ఈ హెచ్చరికలు చేశారు. ఆరోగ్య మౌలిక వసతులను ప్రభుత్వం పటిష్టం చేసిందని, థర్డ్ వేవ్ అవకాశాల దృష్ట్యా ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న ఆక్సిజన్ సామర్థ్యాన్ని 1200 ఎంటీల నుంచి 3,000 ఎంటీలకు పెంచామని చెప్పారు.

Updated Date - 2021-09-05T21:48:59+05:30 IST