BEWARE: 10 డేంజర్ స్పాట్స్ 145 రోడ్డు ప్రమాదాలు...59 మంది మృతి

ABN , First Publish Date - 2022-09-17T17:31:50+05:30 IST

రోడ్డు ప్రమాదాల నివారణకు(road safety awareness) ఢిల్లీ ట్రాఫిక్ పోలీసులు(Delhi Traffic Police) వినూత్న ప్రచారం(campaign) చేపట్టారు....

BEWARE: 10 డేంజర్ స్పాట్స్ 145 రోడ్డు ప్రమాదాలు...59 మంది మృతి

న్యూఢిల్లీ:రోడ్డు ప్రమాదాల నివారణకు(road safety awareness) ఢిల్లీ ట్రాఫిక్ పోలీసులు(Delhi Traffic Police) వినూత్న ప్రచారం(campaign) చేపట్టారు. దేశ రాజధాని నగరమైన ఢిల్లీలోని 10 డేంజర్ స్పాట్లను గుర్తించిన ట్రాఫిక్ పోలీసులు రోడ్డు భద్రతపై కొత్త తరహా ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ద్విచక్రవాహనచోదకులు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని(wearing a helmet) ట్విట్టరు(tweet) ద్వారా పోలీసులు ప్రచారం చేస్తున్నారు. హెల్మెట్ ధరించడం వల్ల ప్రయోజనాలను నెటిజన్లకు వివరించి చెపుతున్నారు. ఢిల్లీలో(Delhi)టాప్ 10 డేంజర్ యాక్సిడెంట్స్ హాట్ స్పాట్లను(10 hot spots) గుర్తించిన పోలీసులు అక్కడ జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.


 2021వ సంవత్సరంలో 10 డేంజర్ స్పాట్లలో 145 రోడ్డు ప్రమాదాలు జరగ్గా, ఆయా ప్రమాదాల్లో 59 మంది మరణించగా, పలువురు గాయపడ్డారు. హెల్మెట్, సీటుబెల్టులు ధరించండి, డ్రైవ్ సేఫ్టీ, రోడ్ సేఫ్టీ అంటూ ఢిల్లీ ట్రాఫిక్ పోలీసులు ప్రచారం చేస్తున్నారు. ఢిల్లీ ఔటర్ రింగ్ రోడ్డుపై ఉన్న భల్సవా చౌక్, పంజాబీ బాగ్ చౌక్, ముకర్బా చౌక్, జఖీరా ఫ్లైఓవర్, న్యూ రోహతక్ రోడ్డు, లిబాస్ పూర్ బస్టాండ్, ముకుంద్ పూర్ చౌక్, మోతీబాగ్ ఫ్లైఓవర్, నంగ్లీ పూనా, సిరాస్ పూర్, శాస్త్రి పార్కు, జీటీ రోడ్డుపై ఉన్న ఐటీ పార్కుల వద్ద ఉన్న యాక్సిడెంట్ స్పాట్ల వీడియోలను ట్రాఫిక్ పోలీసులు విడుదల చేశారు. 


వాహనచోదకులు 10 డేంజర్ యాక్సిడెంట్ స్పాట్ల వద్ద జాగ్రత్తగా ఉండండి, ట్రాఫిక్ నిబంధనలు పాటించండి(Cares, Obey traffic rules. Drive safe) అంటూ పోలీసులు ప్రచారం చేస్తున్నారు. హెల్మెట్ ధరించాలంటూ సలహాతో 15 సెకన్ల వీడియోను పోలీసులు ట్విట్టరులో విడుదల చేశారు. 


Updated Date - 2022-09-17T17:31:50+05:30 IST