యనమల తప్పుడు ప్రచారం మానుకోవాలి: Buggana

ABN , First Publish Date - 2022-06-25T00:08:39+05:30 IST

అమరావతి: ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ రెడ్డి టీడీపీ నేత యనమలపై మండిపడ్డారు. ఆర్థికపరమైన అంశాల్లో యనమల తప్పుడు ప్రచారం చేయడం మంచిది కాదన్నారు. గత

యనమల తప్పుడు ప్రచారం మానుకోవాలి: Buggana

అమరావతి: ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ రెడ్డి టీడీపీ నేత యనమలపై మండిపడ్డారు. ఆర్థికపరమైన అంశాల్లో యనమల తప్పుడు ప్రచారం చేయడం మంచిది కాదన్నారు. గత ప్రభుత్వంతో పోలిస్తే తమ ప్రభుత్వంలో అప్పుల శాతాన్ని బేరీజు వేసి చెప్పారు.

బ్యాంకులు అప్పులు ఇవ్వకూడదనే ...

‘‘కరోనా విపత్కర పరిస్థితుల్లో కూడా ఆర్థిక నిర్వహణ చక్కగా చేశారంటూ కాగ్ ప్రభుత్వాన్ని ప్రశంసించింది. బడ్జెట్ అంచనాలకంటే తక్కువగానే అప్పులు చేశారని ఏపీని ఉద్దేశించి కాగ్ ప్రస్తావించింది. దేశంలోనే ఆర్థిక నిర్వహణ చక్కగా చేస్తోన్న రాష్ట్రాల్లో ఏపీ అగ్రభాగాన ఉంది. వాస్తవాలు ఇలా ఉంటే యనమల రాంగ్ ఫిగర్స్‌తో అస్యత ప్రచారం చేస్తున్నారు. 2.10 శాతం మేర మాత్రమే ఫిస్కల్ డెఫిసిట్ ఉంది. కానీ ఏపీ ప్రతిష్టను దిగజార్చేలా ఆర్థికపరమైన అంశాల్లో కామెంట్లు చేస్తున్నారు. ఏపీకి బ్యాంకులు అప్పులు ఇవ్వకూడదనే ధోరణి టీడీపీలో కన్పిస్తోంది. గత ప్రభుత్వంలో సగటున 19.50 శాతం మేర అప్పులు పెరుగుతూ ఉంటే.. జగన్ ప్రభుత్వంలో కేవలం 15.50 శాతం మాత్రమే పెరిగాయి. ప్రతి దానికి ఏపీని శ్రీలంకతో పోలుస్తున్నారు. డీబీటీల ద్వారా రూ. 1.40 లక్షల కోట్లు పేదలకు చేర్చాం. నాన్ డీబీటీల ద్వారా రూ. 44 వేల కోట్లు లబ్దిదారులకు చేర్చాం. కేవలం బురద జల్లడమే టీడీపీ పని’’ అని అన్నారు. 

Updated Date - 2022-06-25T00:08:39+05:30 IST