కుక్కను తప్పించబోయి..

ABN , First Publish Date - 2022-06-27T06:37:26+05:30 IST

రోడ్డుకు అడ్డంగా వచ్చిన కుక్కను తప్పించే క్రమం లో కారు అదుపు తప్పి రోడ్డు పక్కన గల చెట్టు ను ఢీకొట్టడంతో ఒకరు మృతి చెందగా మరొకరికి గాయాలయ్యాయి.

కుక్కను తప్పించబోయి..
ప్రమాదంలో నుజ్జయిన కారు

 అదుపుతప్పి చెట్టును ఢీకొట్టిన కారు ఒకరి మృతి, మరొకరికి గాయాలు  

కనగల్‌, జూన 26: రోడ్డుకు అడ్డంగా వచ్చిన కుక్కను తప్పించే క్రమం లో కారు అదుపు తప్పి రోడ్డు పక్కన గల చెట్టు  ను ఢీకొట్టడంతో ఒకరు మృతి చెందగా మరొకరికి గాయాలయ్యాయి. ఈ ప్ర మాదం నల్లగొండ మండలంలోని ఎస్‌ లింగోటం స్టేజీ వద్ద ఆదివారం చో టుచేసుకుంది. ఎస్‌ఐ నగేష్‌ తెలిపిన వివరాల ప్రకారం... నల్లగొండ పట్టణంలోని దేవరకొండ రోడ్డులో జ్యుయలరీ షాపు నడుపుతున్న రమే్‌షచారి (36) అత్తగారి గ్రామమైన త్రిపురారం మండల కేంద్రానికి తన స్నేహితుడు నరే్‌షను తీసుకొని వెళ్లాడు. తిరుగు ప్రయాణంలో లింగోటం స్టేజీ వద్దకు రాగానే వీరు ప్రయణిస్తున్న కారుకు కుక్క అడ్డం వచ్చింది. దానిని తప్పించే క్రమంలో కారు అదుపు తప్పి రోడ్డు పక్కన గల చెట్టును బలంగా ఢీకొట్టింది. ప్రమాదంలో కారు నడుపుతున్న రమే్‌షచారికి తీవ్రగాయాలు కాగా నరే్‌షకు కూడా గాయాలయ్యాయి. స్థానికులు 108 వాహనానికి స మాచారం ఇవ్వడంతో ఇరువురిని చికిత్స నిమిత్తం నల్లగొండ పట్టణంలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ రమే్‌షచారి మృతి చెందాడు. మృతుడి తం డ్రి కూరెళ్ల రమణాచారి తులసీనగర్‌ హనుమాన దేవాలయం ధర్మకర్తగా వ్యవహరిస్తున్నారు. రమే్‌షచారి మృతదేహాన్ని ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి, మునిసిపల్‌ చైర్మన మం దడి సైదిరెడ్డి, కౌన్సిలర్‌ గణేష్‌ ఆస్పత్రి వద్ద సందర్శించారు. మృతుడు రమే్‌షచారికి భార్య, ఒక కుమారుడు ఉన్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వ ఆస్పత్రిలోని మార్చురీకి తరలించినట్లు ఎస్‌ఐ పేర్కొన్నారు. 


Updated Date - 2022-06-27T06:37:26+05:30 IST