అగ్ని ప్రమాదాల పట్ల అప్రమత్తంగా ఉండాలి

ABN , First Publish Date - 2021-04-18T06:26:23+05:30 IST

అగ్ని ప్రమాదాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అగ్ని మాపకశాఖ ఎస్సై రామకృష్ణ అన్నారు. పట్టణ సమీపంలోని ఏబీఆర్‌ ఇంజనీరింగ్‌ కళాశాల విద్యార్థులకు శనివారం అగ్ని ప్రమాదాల నియంత్రణపై అవగాహన కల్పించారు.

అగ్ని ప్రమాదాల పట్ల అప్రమత్తంగా ఉండాలి

 ఫైర్‌ ఆఫీసర్‌ రామకృష్ణ

కనిగిరి, ఏప్రిల్‌ 17: అగ్ని ప్రమాదాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అగ్ని మాపకశాఖ ఎస్సై రామకృష్ణ అన్నారు. పట్టణ సమీపంలోని ఏబీఆర్‌ ఇంజనీరింగ్‌ కళాశాల విద్యార్థులకు శనివారం అగ్ని ప్రమాదాల నియంత్రణపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు ప్రమాదాన్ని బట్టి ఆలోచనతో కూడిన చర్యలకు ఉపక్రమించాలన్నారు. దాదాపుగా నివేశ స్థలాల్లో గ్యాస్‌ సిలిండర్‌ ద్వారానో, విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌ ద్వారానో ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్నారు. ఆ సమయంలో గ్యాస్‌ సిలిండర్‌ నుండి వచ్చే మంటలను నియంత్రించే విధానాన్ని మాక్‌ డ్రిల్‌ ద్వారా విద్యార్థులకు చేసి చూపించారు. అదేవిధంగా ఇంటి పరిసరాల్లో ఎక్కువగా గ్రామాల్లో గడ్డి వాములు, పూరిళ్లు ప్రమాదవశాత్తూ అగ్ని ప్రమాదాలు సంభవిస్తాయన్నారు. ఆ సమయంలో చాలా మంది వారి నివేశ పరిసరాలను నీటితో తడపడం లాంటివి చేస్తారన్నారు. ప్రమాదం జరిగిన ప్రాంతంలో అగ్నిని నియంత్రించే చర్యల పట్ల దృష్టి సారించకపోవడం అవగాహన లోపమేనన్నారు. ప్రధానంగా గడ్డి వాములు, ఇళ్లు, ప్రమాదాలు సంభవించి అగ్ని కీలలు వచ్చే సమయంలో అందరూ సమష్టిగా ఆ మంటలను నియంత్రించేలా ఇసుక, నీరు లాంటివి చల్లితే చాలా వరకు అగ్ని కీలలు నియంత్రణలోకి వచ్చే అవకాశం ఉందన్నారు. కార్యక్రమంలో సిబ్బంది రామస్వామి, గురవయ్య, చిరంజీవి, సురేష్‌, శ్రీనివాసులు, రఫి, మోజేష్‌, వీరబాబు తదితరుల పాల్గొన్నారు.

ఆర్టీసీ గ్యారేజిలో అగ్నిప్రమాదాలపై డెమో

కందుకూరు : అగ్నిమాపక వారోత్సవాలలో భాగంగా శనివారం స్థానిక ఆర్టీసి గ్యారేజిలో అగ్ని ప్రమాదాల నివారణ పై డెమో నిర్వహించారు. అగ్నిమాపక అధికారి వి. వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో సిబ్బంది అగ్ని ప్రమాదాలు సంభవించకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ప్రమాదాల సమయంలో నష్ట నివారణ కు తక్షణ ం చేపట్టాల్సిన చర్యలపై అవగాహన కల్పించారు.

Updated Date - 2021-04-18T06:26:23+05:30 IST