డాక్టర్‌ నాగభైరవ అవార్డుకు గ్రంథాలు ఎంపిక

ABN , First Publish Date - 2020-12-03T05:05:41+05:30 IST

డాక్టరు నాగభైరవ కోటేశ్వరరావు అవార్డులకు నాలుగు గ్రంథాలను ఎంపిక చేసినట్లు డాక్టరు నాగభైరవ అవార్డు కమిటీ అధ్యక్షుడు వెన్నెలకంటి రాజేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి చిన్ని నారాయణరావు ఓ సంయుక్త ప్రకటనలో పేర్కొన్నారు.

డాక్టర్‌ నాగభైరవ అవార్డుకు గ్రంథాలు ఎంపిక

నెల్లూరు(సాంస్కృతికం), డిసెంబరు 2 : డాక్టరు నాగభైరవ కోటేశ్వరరావు అవార్డులకు నాలుగు గ్రంథాలను ఎంపిక చేసినట్లు డాక్టరు నాగభైరవ అవార్డు కమిటీ అధ్యక్షుడు వెన్నెలకంటి రాజేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి చిన్ని నారాయణరావు ఓ సంయుక్త ప్రకటనలో పేర్కొన్నారు. ఉత్తమ విమర్శ గ్రంఽథ పురస్కారం - 2019కి ప్రథమ బహుమతిగా గుడిపాటి రచించిన పుట్ట బంగారాన్ని ఎంపిక చేశామన్నారు. ప్రత్యేక బహుమతులకు డాక్టరు రెంటల వెంకటేశ్వరరావు రచించిన ఒలుపు, డాక్టరు ఆదిమళ్ళదిన్నె వెంకటరమణప్రసాద్‌ రచించిన అనంత పద్యం, కేవీ రమణారెడ్డి రచించిన అద్దెపల్లి, శ్రీశ్రీ కవితా ప్రస్థానం ఎంపికయ్యాయని పేర్కొన్నారు. వీరికి త్వరలో జరగబోవు డాక్టరు నాగభైరవ 10వ అవార్డు ప్రదాన కార్యక్రమంలో పురస్కారాన్ని అందజేస్తారని చెప్పారు. మొదటి బహుమతిగా రూ.5వేలు, ప్రత్యేక బహుమతిగా ఒక్కొక్కరికి రూ.1000 ఇచ్చి సత్కరిస్తారని తెలిపారు. గ్రంఽథాల ఎంపికకు న్యాయ నిర్ణేతలుగా వేడిపల్లి రవికుమార్‌, మోపూరు వేణుగోపాలయ్య వ్యవహరించారని తెలిపారు. 

Updated Date - 2020-12-03T05:05:41+05:30 IST