క్వాలిటీ కంట్రోల్‌ పోటీల్లో స్టీల్‌ప్లాంట్‌కు పురస్కారాలు

ABN , First Publish Date - 2020-12-04T04:53:12+05:30 IST

బంగ్లాదేశ్‌ సొసైటీ ఫర్‌ టోటల్‌ క్యాలిటీ మేనేజ్‌మెంట్‌ ఆధ్వర్యంలో ఈ నెల 1 నుంచి 3 వరకు ఢాకాలో నిర్వహించిన అంతర్జాతీయ క్యాలిటీ కంట్రోల్‌ పోటీల్లో స్టీల్‌ ప్లాంట్‌కు ఉత్తమ బహుమతులు లభించాయి.

క్వాలిటీ కంట్రోల్‌ పోటీల్లో స్టీల్‌ప్లాంట్‌కు పురస్కారాలు
పురస్కారాలు పొందిన ప్లాంట్‌ ఉద్యోగులు

ఉక్కు టౌన్‌షిప్‌, డిసెంబరు 3: బంగ్లాదేశ్‌ సొసైటీ ఫర్‌ టోటల్‌ క్యాలిటీ మేనేజ్‌మెంట్‌ ఆధ్వర్యంలో ఈ నెల 1 నుంచి 3 వరకు ఢాకాలో నిర్వహించిన అంతర్జాతీయ క్యాలిటీ కంట్రోల్‌ పోటీల్లో స్టీల్‌ ప్లాంట్‌కు ఉత్తమ బహుమతులు లభించాయి. బ్లాస్ట్‌ఫర్నేస్‌ నుంచి ఏఎంపీఎస్‌, కోక్‌ ఓవెన్‌ నుంచి యాంత్రిక్‌, ఎల్‌ఎంఎం నుంచి నియోవింగ్‌ ఉద్యోగులు పాల్గొని పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌ ఇచ్చారు. బ్లాస్ట్‌ఫర్నేస్‌ నుంచి కె.చంద్రశేఖర్‌, ఎంవీ రమణమూర్తి, అహ్మద్‌వల్లి, సత్యనారాయణ  అప్పలరాజు, యాంత్రిక్‌ నుంచి మురళీకృష్ణారావు, శ్యామ్‌ప్రసాద్‌, రత్నకుమా ర్‌, రామారావు, భాస్కర్‌రావు, నియోవింగ్‌ నుంచి రామకృష్ణ, వెంకన్నరావు, కృష్ణ, గోవిందరావు సత్యనారాయణ ఇచ్చిన ప్రదర్శనలకు పురస్కారాలు ల భించాయి. ఈ సందర్భంగా ఉద్యోగులను ిసీఎండీ పీకే రథ్‌ అభినందించారు.

Updated Date - 2020-12-04T04:53:12+05:30 IST