తెలంగాణకు అవార్డుల పంట

ABN , First Publish Date - 2022-09-23T01:11:55+05:30 IST

తెలంగాణ (Telangana)కు మరోసారి అవార్డుల పంట పడింది. స్వచ్ఛ భారత్ మిషన్‌ (Swachh Bharat Mission)లో అద్భుత ఆదర్శప్రాయ

తెలంగాణకు అవార్డుల పంట

హైదరాబాద్: తెలంగాణ (Telangana)కు మరోసారి అవార్డుల పంట పడింది. స్వచ్ఛ భారత్ మిషన్‌ (Swachh Bharat Mission)లో అద్భుత ప్రదర్శనతో దేశంలో అత్యుత్తమంగా తెలంగాణ నెంబర్ వన్ స్థానంలో నిలిచింది, వివిధ కేటగిరీల్లో 13 స్వచ్ఛ అవార్డులు రాష్ట్రానికి దక్కాయి. ఈ అవార్డులను అక్టోబర్ (October) 2న స్వచ్ఛభారత్ దివాస్ సందర్భంగా రాష్ట్రపతి అందజేయనున్నారు. పెద్ద రాష్ట్రాల జాబితాతో తెలంగాణ అగ్రస్థానంలో నిలిచింది. జిల్లాల కేటగిరిలో దేశంలోనే జగిత్యాల జిల్లా రెండు స్థానాన్ని నిజామాబాద్‌  మూడోస్థానంలో నిలిచాయి దక్కించుకుంది. అంతేకాకుండా స్వచ్ఛ్‌ సర్వేక్షన్‌ గ్రామీణ్‌ సౌత్‌ కేటగిరిలో నిజామాబాద్‌కు రెండోస్థానం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మూడో ర్యాంక్‌ను సాధించింది.


రాష్ట్రానికి 13 అవార్డులు వచ్చాయని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు (Errabelli Dayakar Rao) తెలిపారు. రాష్ట్రానికి అవార్డులు రావడంపై హర్షం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్‌ (CM KCR), కేటీఆర్‌ (KTR) చొరవతోనే అవార్డులు వచ్చాయని తెలిపారు. అవార్డులు ప్రకటించినందుకు కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. అవార్డులతో పాటు నిధులు కూడా ఇవ్వాలని దయాకర్‌రావు కేంద్రాన్ని కోరారు. 

Updated Date - 2022-09-23T01:11:55+05:30 IST