ఎస్‌ఆర్‌కేఆర్‌ కళాశాలకు అవార్డులు

ABN , First Publish Date - 2021-10-27T05:02:54+05:30 IST

సాంకేతిక విద్యాప్రగతికి మార్గదర్శిగా ఎస్‌ఆర్‌కేఆర్‌ ఇంజనీరింగ్‌ కళాశాల నిలుస్తుందని భీమవరం లయన్స్‌ క్లబ్‌ ప్రతినిధులు పేర్కొన్నారు.

ఎస్‌ఆర్‌కేఆర్‌ కళాశాలకు అవార్డులు

భీమవరం ఎడ్యుకేషన్‌, అక్టోబరు 26 : సాంకేతిక విద్యాప్రగతికి మార్గదర్శిగా ఎస్‌ఆర్‌కేఆర్‌ ఇంజనీరింగ్‌ కళాశాల నిలుస్తుందని భీమవరం లయన్స్‌ క్లబ్‌ ప్రతినిధులు పేర్కొన్నారు. టైమ్స్‌ బెస్ట్‌ ఇంజనీరింగ్‌ కళాశాల, బెస్ట్‌ బిజినెస్‌ అవార్డులు రావడం పట్ల లయన్స్‌ ప్రతినిధులు, అధ్యాపకులు అభినందనలు తెలిపారు.కళాశాల ట్రైనింగ్‌ అండ్‌ ప్లేస్‌మెంట్‌ సెమినార్‌హాల్‌లో మంగళవారం సెక్రటరీ ఎస్‌వీ రంగరాజు, ఇన్‌చార్జ్‌ ప్రిన్సిపాల్‌ డా.కె.బ్రహ్మరాజులను సత్కరించారు. ఈ కార్యక్రమంలో కంతేటి వెంకటరాజు, లయన్స్‌ జోనల్‌ చైర్మన్‌ అల్లు రామకృష్ణ, చెరుకువాడ రంగసాయి, డా.మట్లపూడి సత్యనారాయణ, నరహరశెట్టి కృష్ణ, కె.కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-10-27T05:02:54+05:30 IST