ఆరోగ్యంగా ఉండాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి!

ABN , First Publish Date - 2022-03-17T21:39:48+05:30 IST

వీధుల్లో, ఊరిబయట మాత్రమే క్రిములు ఉంటాయనుకుంటే మీ పొరబాటే. మీరు నివసించే ఇల్లు.

ఆరోగ్యంగా ఉండాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి!

ఆంధ్రజ్యోతి(17-03-2022)

వీధుల్లో, ఊరిబయట మాత్రమే క్రిములు ఉంటాయనుకుంటే మీ పొరబాటే. మీరు నివసించే ఇల్లు.. సూక్ష్మజీవుల నిలయం అని మీరు తెలుసుకోవాల్సిన అవసరముంది. ఇంటిని శుభ్రంగా ఉంచుకోవటం వల్లే ఇంటిల్లిపాదీ ఆరోగ్యంగా ఉంటారనే విషయాన్ని మర్చిపోకండి!


బాత్రూమ్‌లో జెమ్స్‌కి కొదువేలేదు. టాయిలెట్‌ ప్రాంతం, ఫ్లోరింగ్‌, బాత్‌ టవల్స్‌, టూత్‌ బ్రష్‌.. ఇలా అన్ని చోట్లా బాక్టీరియా వ్యాపించి ఉంటుంది. ఒక అధ్యయనం ప్రకారం టూత్‌ బ్రష్‌మీద లక్షల బ్యాక్టీరియా ఉంటుందట. అందువల్ల టూత్‌బ్ర్‌షను ప్రతిరోజూ శుభ్రపరచాకే దంతాలు శుభ్రపరచుకోవాలి. టవల్స్‌ను వాష్‌రూమ్స్‌లోనే వదిలేస్తే గాలి చొరబడక పోవటంతో.. దానిపై తేమ ఆరదు. క్రిములు పెరిగిపోతాయి. అందుకే కనీసం రెండు, మూడు రోజులకైనా బాత్రూమ్‌ను శుభ్రపరచటం అలవాటు చేసుకోవాలి. కిచెన్‌ అంటేనే సూక్ష్మజీవుల నిలయం. గ్యాస్‌ స్టౌ దగ్గర ప్రాంతంలో పిండిపదార్థాలు, నీళ్లు, ఆహార పదార్థాలు పడి ఎక్కువశాతం వైరస్‌, బ్యాక్టీరియా ఫామ్‌ అవుతుంది. అందుకే ప్రతిరోజూ వంటగదిని శుభ్రపరచుకోవాలి. కూరగాయలు కట్‌ చేసే ప్రాంతం, కత్తిని ఎప్పటికప్పుడు శుభ్రపరచాలి. సింక్‌లో ఎక్కువశాతం క్రిములు పేరుకుపోతుంటాయి. అవి ప్లేట్స్‌, గ్లాసులకు సులువుగా అంటుకుంటాయి. వీటివల్ల కడుపులో వికారం కలిగే అవకాశం ఉంది. అందుకే సింక్‌ దగ్గర శుభ్రంగా ఉంచుకోవాలి. ఫ్రిజ్‌ చుట్టూ, గ్రాసరీస్‌ ఉండే డబ్బాలు, ప్లేట్స్‌, గ్లాసుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. బయటనుంచి ఎక్కడికెళ్లి వచ్చినా చేతులను శుభ్రం చేయకుండా ఏవీ ముట్టుకోరాదు. వాష్‌ ఏరియాతో పాటు నీళ్లు తగిలిన దుస్తులు, ఇంట్లోని ఫ్లోర్‌మీద ఆహారపదార్థాలు పడితే సులువుగా వైరస్‌, బ్యాక్టీరియా, శిలీంధ్రాలు ఫామ్‌ అవుతాయి. ఇంట్లో ఉండే క్రిముల వల్లే వ్యాధినిరోధక శక్తి తగ్గిపోతుంది. పలురకాల ఆరోగ్య సమస్యలొస్తాయి. అందుకే ఒంటితో పాటు ఇళ్లునూ శుభ్రపరచటం అలవాటుగా చేసుకోవాలి. అలాగని ప్రమాదకరమైన ఫోర్‌ క్లీనర్స్‌ వాడినా శ్వాసకోస సంబంధ వ్యాధులు వస్తాయి. మంచి నీటితో కడిగి పొడిబట్టతో ఫ్లోర్‌ను క్లీన్‌ చేసుకుంటే సరి.. క్రిముల బెడద తగ్గిపోతుంది.

Updated Date - 2022-03-17T21:39:48+05:30 IST