అవగాహనతో అగ్నిప్రమాదాల నివారణ

ABN , First Publish Date - 2021-04-19T04:42:21+05:30 IST

అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా ఆదివారం అంబేడ్కర్‌ కూడలి వద్ద ఉన్న పెట్రోల్‌ బంకులో అగ్ని ప్రమాదాలపై అవ గాహన కల్పించారు.

అవగాహనతో అగ్నిప్రమాదాల నివారణ

విజయనగరం క్రైం, ఏప్రిల్‌ 18: అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా ఆదివారం అంబేడ్కర్‌ కూడలి వద్ద ఉన్న పెట్రోల్‌ బంకులో అగ్ని ప్రమాదాలపై అవ గాహన కల్పించారు. వాహనదారులకు  అగ్నిమాపక సిబ్బంది కరపత్రాలు పంపిణీ చేశారు. అనంతరం జిల్లా సహాయ అగ్నిమాపక శాఖాధికారి వి.సోమేశ్వరరావు మాట్లా డుతూ... వేసవి కాలంలో అగ్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని, ఈ మేరకు ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ముఖ్యంగా పెట్రోల్‌ బంకులో పెట్రోల్‌ పోసినపుపడు సెల్‌ఫోన్‌లో వాహనదారులు మాట్లాడడం, సిగరెట్‌ కాల్చడం వంటివి చేయరాదన్నారు. అలా చేయడం వల్ల  ప్రమాదాలు సంభవిస్తాయన్నారు.  కార్యక్రమంలో లీడింగ్‌ ఫైర్‌మెన్‌ జి.ఆదినారాయణ, అగ్నిమాపక శాఖ సిబ్బంది బి.శంకర్‌, ఎస్‌.హరికృష్ణ, జి.గౌరీశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. 

పార్వతీపురంటౌన్‌: అగ్నిప్రమాదాలపై అందరూ అవగాహన కలిగి ఉండాలని అగ్నిమాపక శాఖాధికారి సోమేశ్వరరావు  తెలిపారు. ఆదివారం పట్టణ శివారులోని పెట్రోల్‌ బంకు వద్ద  అగ్నిప్రమాదాలను ఎలా ఎదుర్కోవాలో అనే విషయంపై ద్విచక్ర వాహనచోదకులకు అవగాహన కల్పించారు. ఇలాంటి సమ యంలో మానసికంగా బలంగా ఉండాలన్నారు. బంకుల వద్దనే కాకుండా ప్రజలు తమ గ్రామాల్లో సంభవించే అగ్నిప్రమాదాలు, విపత్తులను ఎలా ఎదుర్కోవాలో వివరించారు. ఇళ్లలో మహిళలు గ్యాస్‌ సిలిండర్‌ ఉన్న చోట కిరోసిన్‌, ఇతర మండే పదార్థాలను ఉంచరాదన్నారు. కరోనా విజృంభిస్తున్న తరుణంలో ప్రతి ఒక్కరూ నిబంధనలు పాటించాలని సూచించారు. నిర్లక్ష్యంతో ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని తెలిపారు. 



Updated Date - 2021-04-19T04:42:21+05:30 IST