అవగాహన ముఖ్యం : ఎస్పీ

ABN , First Publish Date - 2021-04-18T04:50:37+05:30 IST

రెండో విడత కరోనా విజృంభిస్తున్నందు వల్ల ప్రజలు మాస్కు ధరించాలనే అవగాహన పొందడం చాలా అవసరం అని ఎస్పీ ఫక్కీరప్ప అన్నారు.

అవగాహన ముఖ్యం : ఎస్పీ

జూపాడుబంగ్లా, ఏప్రిల్‌ 17: రెండో విడత కరోనా విజృంభిస్తున్నందు వల్ల ప్రజలు మాస్కు ధరించాలనే అవగాహన పొందడం చాలా అవసరం అని ఎస్పీ ఫక్కీరప్ప అన్నారు. శనివారం ఆయన జూపాడుబంగ్లా పోలీసు స్టేషన్‌ను ఆకస్మికంగా  తనిఖీ చేశారు. ప్రజలు మాస్కు ధరించేలా అవగాహన కల్పించినా మార్పు రాకపోతే రూ. 1000 నుంచి రూ. 2000 వేల వరకు అపరాధ రుసుము వేయాలని పోలీసు సిబ్బందికి ఆదేశించారు. అపరాధ రుసుము వసూలు చేయడం కంటే అవగాహన కల్పించడమే ముఖ్యమని అన్నారు. గతేడాది కరోనా సమయంలో  విధులు బాగా నిర్వహించిన పోలీసులకు  ప్రశంసా పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో రూరల్‌ సీఐ ప్రసాదు, పోలీసు సిబ్బంది వున్నారు.


  ఎన్నికల్లో పోలీసుల సేవలు అభినందనీయం
ఆత్మకూరు:
ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో పోలీసుల సేవలు అభినందనీయమని ఎస్పీ ఫక్కిరప్ప పేర్కొన్నారు. ఈ మేరకు శనివారం ఆత్మకూరు పోలీసుస్టేషన్‌కు చేరుకున్న ఆయన పంచాయతీ, మున్సిపల్‌, పరిషత్‌ ఎన్నికలను దిగ్విజయంగా పూర్తిచేసిన ఆత్మకూరు సీఐ బీఆర్‌ కృష్ణయ్య, ఎస్సై నాగేంద్రప్రసాద్‌, హెడ్‌ నికానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్లు, హోం గార్డులకు ప్రశంసా పత్రాలను అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఆత్మకూరు మండలంలోని  ఎన్నికల్లో  అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంతంగా జరిపినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఆత్మకూరు డీఎస్పీ వై.శృతి ఉన్నారు.


‘ప్రజల్ని అప్రమత్తం చేయండి’
బండి ఆత్మకూరు, ఏప్రిల్‌ 17:
కరోనా రెండో  విడత ఉధృతి పట్ల ప్రజల్ని అప్రమత్తం చేయాలని ఎంపీడీవో వాసుదేవగుప్త, ఈవోపీఆర్డీ శ్రీనివాసులు, ఏపీఎం రాజశేఖర్‌రెడ్డి సూచించారు. శనివారం మండలంలోని పెద్దదేవళాపురం గ్రామంలో వలంటీర్లతో సమావేశం జరిపారు. ముఖ్యంగా గ్రామాల్లో ప్రజల్ని కొవిడ్‌ పట్ల చైతన్యవంతం చేయాల్సింది   వలంటీర్లేనని అన్నారు.


 పాములపాడు: పాములపాడు పోలీస్‌ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న పోలీసులకు ఎస్పీ పక్కిరప్ప ప్రశంసా పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటీవల జరిగిన ఎన్నికల్లో ప్రతిభ కనపరిచిన పోలీసులకు ప్రశంసా పత్రాలు అందజేస్తున్నామని అన్నారు.

Updated Date - 2021-04-18T04:50:37+05:30 IST